జంట పాముల సయ్యాట ఆత్మకూరు ప్రజలను కనివిందు చేశాయి.. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో రెండు జంట పాములు పెనవేసుకొని సయ్యాటలాడుతూ మత్తులో దిగాయి.. అవి సుమారు గంటన్నర పాటు సయ్యాటలాడాయి..
సాయం సంధ్యవేల ఆహ్లాదకరమైన వాతావరణంలో.. పచ్చని గడ్డిలో.. రెండు భారీ జెర్రీ పాములు సయ్యాటలాడుతూ.. ప్రేమ మత్తులో మునిగిపోయాయి.. మత్తులో మునిగిపోయిన జర్రి పాములు చుట్టుపక్కల ప్రజలు వచ్చినా సరే ఏ మాత్రం అవి భయపడకుండా తమ ప్రేమాయనాన్ని కొనసాగిస్తూ.. సయ్యాట లాడాయి.. ఈ సన్నివేశాన్ని చూసిన ఆత్మకూరు ప్రజలు తమ సెల్ ఫోన్ల లో వీడియోలు తీశారు.
ఇలా జంట పాములు పెన వేసుకున్న దృశ్యాలను చూసిన వారి జన్మ ధన్యమవుతుందని కొందరు భావిస్తారు..జంట పాములను చూడడం అదృష్టంగా కొందరు భావిస్తారు.. మరికొందరు అవి తిరిగిన ప్రాంతంలో పూజలు చేస్తారు. పిల్లలు కాని వారికి సైతం అవి తిరిగిన ప్రాంతాల్లో పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.. నానుడి ప్రజల్లో ఉంది..
#Twinsnakecharmer