శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓటమి తర్వాత మొదటిసారి.. నియోజకవర్గంలోని ఆత్మకూరు వైసీపి కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు .. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సర్వసాధారణమని అన్నారు. అలాగే టిడిపి నాయకులు రెచ్చగొట్టిన సమన్వయం పాటించాలని… ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని మీకు అండగా నేను ఉంటానని.. మళ్లీ మీకోసమే పని చేస్తానని.. వైసిపి నాయకులకు కార్యకర్తలకు శిల్పా చక్రపాణి రెడ్డి భరోసా ఇచ్చారు.
ఏది ఏమైనాపటికి ఓటమిని అంగీకరిస్తున్నామని గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం మంచి పాలన అందించాలని వారి గెలుపును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి హామీలన్నీ నెరవేర్చడం కత్తి మీద సాములాంటిదేనని అన్నారు.
హామీలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులకు దిగడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని ఖండించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం వచ్చిందని.. కేంద్రంలో చంద్రబాబు నాయుడి అవసరం ఉంది కాబట్టి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా తీసుకురావాలని.. ప్రత్యేక హోదా తోనే ఆంద్రప్రధేశ్ అభివృద్ది సాధ్యమని.. ప్రత్యేక హోదా తెస్తే నారా చంద్రబాబు నాయుడును.. మనస్ఫూర్తిగా అభినందిస్తామని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కానీ మోడీ ఎలాంటి వారో అందరికీ తెలుసని దుయ్యబట్టాడు.
ఆరు నెలలు ప్రభుత్వం మీద ఏది మాట్లాడ దలుచుకోలేదని అంటూనే… వైసీపీ ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు , కూరగాయల ధరలు , నిత్యవసర ధరలు పెరిగాయి అంటూ.. అప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన టిడిపి నాయకులు ఇప్పుడు ధరలు తగ్గించి మంచి పాలన అందిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు..
అలాగే సంగమేశ్వరం దగ్గర తీగెల వంతెనను వ్యతిరేకించి బ్రిడ్జి కం బ్యారేజీ కట్టాలని గతంలో గగ్గోలు పెట్టిన నాయకులు ఇప్పుడు తిరిగి ..వారే అధికారంలోకి వచ్చారు కనుక అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీ కూడా కట్టిస్తారని.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై సెటైర్లు వేశారు.