YCP యువత పోరు పై – శ్రీకాంత్ గౌడ్

YCP YUVATA PORU PAI SRIKANTH GOUD FIRE

YCP YUVATA PORU PAI SRIKANTH GOUD FIRE

శ్రీశైలం నియోజకవర్గం – ఆత్మకూరు మండలం

జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని “యువత పోరుకు” పిలుపునిచ్చావ్. తెలుగు యువత మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ సూటి ప్రశ్న.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అయ్యా జగన్ మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ఉద్యోగమైనా కల్పించారా….

నేడు మీకు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్క కూడా చేసి కేవలం 11 సీట్లకే పరిమితం చేస్తే సిగ్గు హేగ్గు లేకుండా యువతను తప్పుదోవ పట్టించడానికి తిరిగి ప్రయత్నించడం తగునా….

అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరానికి 2 లక్షల 70 వేల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులకు మొండి చేయి చూపించింది మీరు కాదా..

మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఏ ఒక్కసారైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశారా లేదే..

కనీసం ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేసావా… పోతూ పోతూ ఫీస్ రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్ళింది నిజం కాదా…

₹4271 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా మోసం చేసింది మీరు కాదా..

2014 -19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే…

2019లో మీరు అధికారంలోకి వచ్చి కేవలం 9 లక్షల మందికి ఫీజు రీయంబర్స్మెంట్ కల్పించి మిగిలిన 7 లక్షల మందికి మొండి చేయి చూపించింది మీరు కాదా..

2014 -19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆరు లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పిస్తే అదే మీరు అధికారంలోకి వచ్చి దాన్ని రద్దు చేసింది నిజం కాదా…

నోరు తెరిస్తే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడే నువ్వు వాళ్ళ సబ్ ప్లాంట్ నిధులను ఇతరత్రా వాటికి దారి మలించి వారికి ద్రోహం చేసింది నిజం కాదా.

2014 -19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ సంస్థలలో 12 లక్షల ఉద్యోగాలు కల్పించింది నిజం కాదా.. అవి మీ కంటికి కనపడలేదా.

2014 సంవత్సరంలో రాష్ట్ర మొత్తానికి 5,000 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉంటే.. 2019 నాటికి అప్పటి మంత్రి నారా లోకేష్ గారి చొరవతో 35 వేల మందికి పెంచడం జరిగింది.

2019లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన నువ్వు అప్పులు తప్ప రాష్ట్రానికి ఆదాయ వనరులు ఒక్క శాతమైన సమకూర్చావా.. లేదే..

అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నువ్వు ,,నీ మంత్రివర్గం ,,నీ ఎమ్మెల్యేలు ,,నీ అనుచరులు రాష్ట్ర సంపదను దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎక్కడైనా అభివృద్ధి చేశారా లేదే.

మీరు చేసిన నిరంకుషత్వ పాలనను చూసి రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదాను సైతం దూరం చేస్తే గాని మీకు సిగ్గు రాలేదా…

ఈరోజు మీరు ఏ మొహం పెట్టుకొని యువత పోరు అనే కార్యక్రమం ద్వారా రోడ్లపైకి వస్తున్నారు.. మీరు చెప్పే కల్లిబొల్లి మాటలు వినడానికి యువత ప్రజల సిద్ధంగా లేరు. మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top