వాలంటీర్లు వందనం – ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి

Salute-to-the-volunteers-MLA-Shilpa-Chakrapani.jpg

వాలంటీర్లకు వందనం కార్యక్రమములో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు…

ఈరోజు శ్రీశైలం నియోజకవర్గం బండిఆత్మకూరు మండలం పార్ణపల్లే టిటిడి కళ్యాణ మంటపం నందు వాలంటీర్లు వందనం కార్యక్రమము నిర్వహించి వారికి సేవా రత్న, సేవా వజ్ర, అవార్డుల పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమములో ఎమ్మెల్యే& ఎథిక్స్ కమిటీ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి గారు పాల్గొన్నారు

ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు అయిన వాలంటీర్లు అందరూ అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రజల ఇంటివద్దకే వచ్చి సేవలందిస్తున్నారు. వారందరికీ సెల్యూట్ తెలియజేశారు.
ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పధకము ప్రజల ఇళ్ల వద్దకే చేర్చి వాళ్ళ మన్ననలు మా సారథులు మా వాలంటీర్లు అని , కులం,మతం,ప్రాంతం, పార్టీల కతీతంగా ప్రభుత్వం అందించే పథకాలు ఇంటిముంగితకే వచ్చి సేవలు అందిస్తున్నారు మా పిల్లలు, వాలంటీర్లు అని తెలిపారు. ఈరోజు ప్రతి పక్ష పార్టీలు మాట్లాడుతున్నారు.వాళ్లకు ఒకటే చెబుతున్న కరోనా మహమ్మారి టైంలో మీరు ఎక్కడ దాక్కున్నారు. వీరి వాలంటీర్లు సేవలు అమోఘం అని కొనియాడారు. సొంత కుటుంబ సభ్యులు కూడా దరి దపుల్లోకి కూడా రాని కరోనా టైం లో అంతకు మించి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ గా సేవలు అందించారు.ఈరోజు ప్రతి పక్ష పార్టీలు మా పిల్లల మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వారందరికీ వాలంటీర్లు బుద్ది చెప్పే టైం ఆసన్నమైంది అని తెలియజేశారు…
వలంటీరల్ను అందరినీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు మన ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలను ప్రజలందరికీ తెలియజేసే పూర్తి బాధ్యత మీకే వుందని తెలిపారు… అదేవిదంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయి వస్తారు ఏదో కల్లబొల్లి మాయ మాటలు చెప్పి ఓట్లు దందుకొనికి వస్తారు. మీరు అలాంటి వాళ్ళను నమ్మొద్దు,వారి మాటలు వినొద్దు మనందరి ప్రభుత్వం ,నేను మంచి చేశాను అంటేనే నాకు ఓటు వేయండి అని తెలిపారు…

ఈ కార్యక్రమంలో శిల్పా భువనేశ్వర్ రెడ్డి గారు,
బండిఆత్మకూరు మండలం మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top