- ధనుశాల లింగమయ్య వద్ద శ్రీశైలానికి సొరంగ మార్గం
- పాండవుల దండకారణ్యంలో చరిత్రగా నిలచిపోయిన మహిమానిత్వ ఆలయాలు
- అర్జునుడు వదిలిన బానానికి నీటి వనం, పుష్కలం
- ప్రతి మంగళవారం భక్తితో పూజలు చేస్తే కుంభవృష్టితో వరుణ దేవుడి కటాక్షం
- ఆ ప్రాంతంలో చిత్తశుద్దితో ప్రార్థనాలు చేస్తే పాడిపంటలు సంవృద్ధి
- తప్పులు చేసి భక్తిని చాటుకోవాలని చూస్తే తేనెటీగా దాడులు తప్పవు
- అరణ్యవాసంలో పాండవుల వనవాసం
మహభారతంలో పాండువుల వనవాసం చేసే నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో చరిత్రగా చెబుకునే ఆలయాలు పురాతనమైన దేవాలయాలు మరెన్నో ఇక్కడా కొలువు తీరాయి. శతబ్దాల కాలం నుంచి రాజులు పరిపాలించిన నల్లమల పర్వతంలో పాండవులు దండకారణ్యంతో శ్రీశైల పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లి తమ భక్తిని చాటుకునే విదంగా ఎంతో గొప్పగా చెబుకున్నవచ్చు. అసలు పాండవులు ఎందుకు వన వాసం చేయాల్సి వచ్చింది. అనే విషయం అందరికి తెలసిందే. అయితే ఈ నల్లమల అటవీ ప్రాంతంలోని పురాతనమైన ఆలయాల వద్ద ఓ ప్రత్యేక చరిత్ర కూడా గాంచి ఉంది.
నల్లమల పర్వతంలో దండకారణ్యం.. పాండవుల వనవాసం..!
వనవాసం చేసేందుకు వచ్చినా ఐదుమంది పాండవులతో పాటు దండకా రణ్యంలో దాహం తీర్చుకునేందుకు అర్జునుడు తమ బాణంతో భూమిలోకి వదలడంతో వెంటనే నీటి బుగ్గాలుగా బయటికి రావడంతో పాండవులు తమ దాహార్తిని తీర్చుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా లోని కొత్తపల్లె మండలం పాతమాడుగుల కప్పిలేశ్వరం గ్రామ వంట పొలాల మద్యలో కొలువైన ధనుశాల లింగమయ్య వద్ద ఓ చరిత్రనే చెబుకునే విదంగా భక్తులు నమ్ముకుంటున్నారు. అసలకు వర్షాలు రాని నేపథ్యంలో వరుణదేవుడి కోసం చుట్టుపక్కల గ్రామీణప్రాంత భక్తాదులు, పాడిపంటలు పండించే రైతన్నలు మహిమానిత్వం చిత్తశుద్ధితో ప్రార్ధనాలు చేస్తే అక్కడా ఇంటికి వెళ్లిన మరుక్షణమే వరుణదేవుడి కటాక్షం వరించింది. పెద్ద ఎత్తున్న వర్షాలు పడుతాయనే నమ్మకం భక్తులో అలాగే నిండిపోయింది. అరణ్య వాసంలో పాండవులు వచ్చేపుణ్యక్షేత్రాలలో సప్తనదుల సంగమేశ్వర ఆలయం, ధనుశాలలింగమయ్య నుంచి సొరంగ మార్గం ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజామార్గంను తయారు చేసుకున్నారు. మహావృక్షాలు మామిడి చెట్లు వనంగా మారింది.ప్రతి మంగళవారం భక్తులు తమభక్తిని చాటుకునేందుకు పూజలు నిర్వహిస్తారు.
తప్పులు చేసి భక్తిని చాటుకోవాలని చూస్తే తేనే టీగాల దాడులు తప్పవు..
నిబద్ధతతో భక్తిని చాటుకునేందుకు వెళ్లే భక్తాదులు జరగరాని తప్పులు చేసి భక్తిని చాటుకోవాలని చూస్తే అక్కడే తేనేటీగల దాడులు అధికంగా అవుతాయని భక్తుల యెక్క నమ్మకం గతంలో ఈ ప్రాంతంలో కొందరు ఆరాచక పనులు చేసేందుకు దంతాల లింగమయ్య స్వామి సన్నిదిలో గుప్తనిధుల వేటగాళ్లు, పురాతనమైన ఆలయాలను తవ్వకాలను జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రాత్రివేళ సమయంలో అక్కడికి వెళ్లి గుప్తనిధుల వేటగాళ్లు తవ్వకాలు ప్రారంభించిన మరుక్షణమే తేనేటీగలు భయంకరమై రీతిలో దాడులు చేస్తాయి. అక్కడి నుంచి పరుగులు తీయక తప్పడం లేదు.
అర్జునుడు విసిరినా బాణానికి ఆ ప్రాంతం అంతా జలయమం..
వేనవి కాలం, శీతాకాలం, వర్షాకాలం అని తేడా లేకుండా ఎప్పుడు ఆ ప్రాంతంలో అర్జునుడు విసిరినా బానానికి ఎప్పుడు జలమయంగానే ఆ ప్రాంతం కలకల లాడుతునే ఉంటుంది. పంచ పాండవులు, అరణ్య వాసం వెళ్లేందుకు దండకారణ్యంతో నల్లమల పర్వతాలో ధనుశాల లింగమయ్యకు భక్తులు నేటి వరకు ప్రత్యేక పూజలనుకొనసాగిస్తునే ఉన్నారు. నమ్మకంను వమ్ముచేసుకోకుండా మహిమానిత్వంలో పూజలను కొనసాగిస్తునే ఉన్నారు. నల్లమల అడవులో ఉరుములు, మెరుపులు వస్తే వర్షం మొదలైందనే నమ్మకం భక్తులో అలాగే నిలచిపోయింది. కొత్తపల్లి మండలంలోని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు చెందిన భక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడా పూజలను కొనసాగిస్తునే ఉన్నారు. నల్లమల అడవులో వెలసిన ఎన్నో పుణ్యక్షేత్రాలలో చరిత్రగా చెబుకునే ఈ ధనుశాల లింగమయ్య స్వామి ఒకరు.
Alsho Read అంకాలమ్మ కోట Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
#dantalalingamayya #danushalalingamayya