కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది..
అటు చికెన్ ప్రియులు కూడా చికెన్ కు దూరంగా ఉండి, మటన్, చేపల వైపు మొగ్గు చూపడంతో .. అటు కోళ్ల పెంపకం దారులు, ఇటు చెకెన్ షాపు యజమానులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
చికెన్ షాపులు వెలవెలబోయి.. చికెన్ అమ్మకాలు లేక షాపులు మూతపడే పరిస్థితికి ఏర్పడింది..
ఈ క్రమంలో చెకెన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. చికెన్ షాపు యజమానులతో కలిసి .. వెంకటేశ్వర హేచరీస్. ప్రయివేట్ లిమిటెడ్ చికెన్ కంపెనీ వారి ఆధ్వర్యంలో..
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం లోని వలి చికెన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో .. ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు..
మంగళవారం నాడు సాయంకాలం ఈ చికెన్ & ఎగ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించగా.. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరంగా ఉన్న చికెన్ ప్రియులు ఒట్టుతీసి గట్టున పెట్టినట్టు .. భయాన్ని పక్కన పెట్టి పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
ఉచితంగా చికెన్ పకోడా.. ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేస్తున్నడంతో చికెన్ ప్రియులు భారీగా ఎగబడ్డారు..
రెండు వందల కేజీల చికెన్ పకోడా.., రెండు వేల వరకు ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేయగా నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి అంటే జనం ఏరకంగా ఎగబడ్డారో..అర్ధమైపోతుంది.
ఉచితంగా చికెన్ పకోడా – గుడ్డు ఇవ్వడంతో చికెన్ ప్రియులు లొట్టలు వేసుకొని లాగించేశారు..
ఈ సందర్భంగా.. వెంకటేశ్వర హేచరీస్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ వారు, అలాగే ,చికెన్ షాపుల యాజమాన్యం మాట్లాడుతూ..
చికెన్ తినడం వల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం లేదని , 70 డిగ్రీల సెంటీ గ్రేడ్ వేడిలో ఉడికించిన చికెన్ కు ఎలాంటి వైరస్ లక్షణాలు ఉండవని అన్నారు.. ఎలాంటి వదంతులు నమ్మకుండా చికెన్ ధైర్యంగా తినండి అని అక్కడికి వచ్చిన ప్రజలకు వారు వివరించారు..
చికెన్ తినడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ..అలాగే గుడ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగి ఎలాంటి రోగాలు దరి చేరవని.. భయం లేకుండా నిర్భయంగా చికెన్ , కోడిగుడ్లు తినొచ్చని.. చికెన్ ప్రియులకు అవగాహన కలిగించారు.