ఆత్మకూరు : 20.02.2025
ఎల్ఐసి లో నూతన నియామకాలు చేపట్టాల్సిందే
మెజారిటీ సంఘానికి గుర్తింపు పునరుద్ధరించాల్సిందే
దేశవ్యాప్త ఒక్క గంట ఎల్ఐసి సిబ్బంది సమ్మె జయప్రదం
— సమ్మె సందర్భంగా వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
ఎల్ఐసి లో గత ఏడేండ్లలో 15 వేల మంది ఉద్యోగులు తగ్గిందని, సంస్థ కోసం పాలసీదారుల కోసం తక్షణం నూతన నియామకాలు చేపట్టాల్సిందేనని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆత్మకూరు బ్రాంచి కార్యదర్శి మనోజ్ కేపీ డిమాండ్ చేశారు. స్థానిక బ్రాంచి కార్యాలయం ఎదుట అధ్యక్షుడు విజయ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక గంట దేశవ్యాప్త సమ్మె కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఇన్సూరెన్స్ రంగం రూపురేఖలు మారిపోతున్న దశలో, నూతన తరం పాలసీదారుల ఆకాంక్షల మేరకు పనిచేయాలంటే ఉన్నత విద్యావంతులైన, హైటెక్ పరిజ్ఞానం ఉన్న యువత నూతన ఉద్యోగులుగా నియమించుకోవాల్సిన అవసరం ఎల్ఐసి కి ఉందని అన్నారు. జవాబుదారీతనం లేని ఔట్సోర్సింగ్ స్థానంలో రెగ్యులర్ నియామకాలే పరిష్కారమన్నారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా ఎల్ఐసి లో అవసరమైన మేరకు నియామకాలు చేపట్టాలన్నారు. దేశంలో ఉన్న 80 శాతం ఎల్ఐసి సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ) కు గుర్తింపు పొందిన సంఘంగా హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంస్థ కోసం, పాలసీదారుల కోసం, సిబ్బంది కోసం విషయాల దృక్పథంతో పనిచేస్తున్న అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం భారత కార్మికోద్యమ చరిత్రలో ఆదర్శప్రాయమైనదని, ఆ సంఘానికి గుర్తింపు పునరుద్ధరించడమంటే సంస్థలో ప్రజాస్వామిక సాంప్రదాయాలు నిలపడమేనని, అలాగే నూతన నియామకాలు కూడా చేపట్టాలని *ప్రజా సంఘాలు ప్రతినిధులు (CITU)ఏసురత్నం,రణధీర్,రాంనాయక్ ,వీరన్న , సంఘీభావం వ్యక్తం చేశారు. అలాగే సంస్థలోని NFIFWI సంఘం నాయకులు జగన్నాధ రాజు మాట్లాడుతూ బలమైన ఎల్ఐసి మాత్రమే బలమైన దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదని, ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎల్ఐసి యాజమాన్యం ఏకపక్ష ధోరణులు మాని ప్రజాస్వామికంగా వ్యవహరించాలన్నారు.
ఈ ఒక్క గంట సమ్మె కార్యక్రమంలో యూనియన్ల నాయకులు నాగన్న,జబీవుల్లాహ్ రవి ,శోభారాణి ,ప్రవీణ్ ,చంద్రశేఖర్ ,అమీర్ ,సౌభాగ్యవతి ,ఉమాదేవి ,సుచిత్ర ,ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.