నంద్యాల జిల్లా
బనగానపల్లె నియోజకవర్గ
హైకోర్టులో కేసు గెలిచిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె పట్టణం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి కార్యాలయం నందు సంబరాలు జరుపుకున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు….
బనగానపల్లె పట్టణ ప్రాంతవాసుల కల త్వరలోనే నెరవేరబోతుంది…..
ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించిన బీసీ జనార్దన్ రెడ్డి….
హైకోర్టులో బీసీ జనార్దన్ రెడ్డి అతని అనుచరులకు బిగ్ షాక్……
దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఎన్నికల అనంతరం బనగానపల్లె పట్టణ ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం……
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి గారు విజయం తథ్యం….
బనగానపల్లె పట్టణం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం నందు బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు బనగానపల్లె పట్టణ ఇంటి పట్టాల విషయంలో హైకోర్టులో పేదప్రజల వైపు తీర్పురావడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు. పేదలు పెత్తందారుల మధ్య జరిగిన ఈ న్యాయ పోరాటంలో దేవుడి ఆశీస్సులతో పేదలు గెలుపొందడం జరిగిందని చెప్పారు. బనగానపల్లె పట్టణంలో 1992 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సారధ్యంలో ఎస్ఆర్బిసి ప్రధాన కాలువ కెనాల్ కొరకు మట్టి కోసం భూములు కొనడం జరిగిందని భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగిందని చెప్పారు. ఎస్ ఆర్ బి సి కి సంబంధించినటువంటి భూములను రెవెన్యూ పరిధిలోకి తీసుకొని 2012 వ సంవత్సరంలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన కాటసాని రామిరెడ్డి గారు ఆనాటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శంకర్ గారి ఆధ్వర్యంలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆనాడే తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి పేదలకు ఇంటి స్థలాలు రాకుండా హైకోర్టుకు వెళ్లి భూ యజమానుల ద్వారా అడ్డు వేయడం జరిగిందని చెప్పారు.

అనంతరం 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ప్రభుత్వ ద్వారా ఇంటి స్థలాలు పేదలకు అందించడం జరిగిందని అందులో భాగంగానే బనగానపల్లె పట్టణంలో 3200 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ భూమి అణువుగా ఉంటుందని ఉన్నతాధికారులు ఆ భూములను పరిశీలించిన తర్వాత ఇంటి స్థలాలు ఇవ్వాలని బనగానపల్లె పట్టణంలోని పేదల సొంతింటి కలను సహకారం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆలోచన చేస్తే మళ్లీ బీసీ జనార్దన్ రెడ్డి తన అనుచరులతో హైకోర్టులో స్టేటస్ కో తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఆనాడు అడ్డుపడిన హైకోర్టులో కేసు ఈరోజు తీర్పు ప్రజాపక్షానా రావడం జరిగిందని చెప్పారు. ఎన్నికల కోడ్ అనంతరం అర్హులైన ప్రతి పేదవానికి ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుందని ఇంకా అర్హులు ఉండి ఇంటి స్థలాలు రానీ వారికి కూడా ఎన్నికల కోడ్ అనంతరం ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పారు. పేదల పక్షాన హైకోర్టులో ప్రజల పక్షాన పోరాటం చేసిన ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి,జిల్లా రెవెన్యూ అధికారులకు, ఎస్ఆర్బిసి అధికారులకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లె పట్టణ ప్రజల తరఫున బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.