చిత్తూరు జిల్లా పోలీసు
శక్తి యాప్స్, బాల్య వివాహలు మరియు మహిళల అత్యవసర నంబర్ల పై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న చిత్తూరు మహిళా పోలీసులు
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, IPS గారి ఆదేశాల మేరకు శక్తి టీం నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇంచార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్. ఆర్.రాజశేఖర్ రాజు గారి పర్యవేక్షణలో ఈరోజు గుడిపాల మండలంలోని శ్రీ లక్ష్మి నరసింహ ఫార్మసీ కాలేజ్ నందు మహిళా ఇన్స్పెక్టర్ శ్రీ మహేశ్వర్ గారు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అత్యవసర సమయంలో ఒకే (SOS) బటన్ ప్రెస్ చేయగానే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుంది.
ఈ యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, అత్యవసర సేవలు అందించేందుకు ఇది ఎంతో మేలైన సాధనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, “ప్రతీ యువతి, మహిళా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా అవసరం. అత్యవసర సమయంలో ఇది మన రక్షణకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని” మన భద్రత మన చేతుల్లోనే ఉంది” అని అన్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నిషేదం, అవి బాలికల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఏదైనా బాల్యవివాహం గమనించినపుడు వెంటనే 1098 నంబర్ కు సమాచారం ఇవ్వాలి. అలాగే, మహిళలు ఎదుర్కొనే అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా ఎస్.ఐ శ్రీమతి నాగ సౌజన్య, కాలేజి సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.