- ప్రభలిన అతిసారా.. ఆగని మరణారు
- ఆత్మకూరు ప్రజల పాలిట శాపంగా మారుతున్న అతిసార వ్యాధి
- అతిసారా వ్యాధి కి మరో వ్యక్తి బలి
- ఇప్పటి వరకు ముగ్గురిని బలితీసుకున్న అతిసారా
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత నాలుగు రోజుల నుంచి నీరు కలుషితం కావడంతో.. అతిశార వ్యాధి ప్రభలింది. ఇదివరకే ఇద్దరు మృతిచెందగా.. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు..
ఆత్మకూరులోని నీలితొట్టి వీధికి చెందిన రామచంద్రుడు నాయక్ అనే వ్యక్తి వాంతులు, విరోచనాలతో నాలుగు రోజుల కిందట కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ఉదయం చికిత్స పొందుతున్న రామచంద్రుడు నాయక్ మృతి చెందాడు.
ఇప్పటికే బషిరూన్ బి , రహంతుల్లా. అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. తాజాగా రామచంద్రుడు నాయక్ మృతి మృతి చెందారు..
వీరంతా ఆత్మకూ పట్టణంలోనే నీలి తొట్టి వీధికి చెందిన వారే ..
మృతి చెందిన వారంతా ఒకే వీధికి చెందినవారు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నీరు కలుషితమైందని కాలనీవాసులు మొరపెట్టుకున్న అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు..
తూతూ మంత్రంగా కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లి , చెత్తాచెదారాన్ని క్లీన్ చేసి వెళ్తున్నారే తప్ప వాస్తవాలు వెలిబుచ్చడం లేదు..
ఈ ఘటన సంభంధించి జిల్లా కలెక్టర్ ఆత్మకూరుకు వచ్చారే తప్ప.. కాలనీలో పర్యటించకుండా ఆర్డీవో ఆఫీస్ లో .. కూర్చుని అధికారులకు నివేదిక కోరారు.
మున్సిపల్ అధికారులు , జిల్లా వైద్యాధికారులు , ఇచ్చిన సమాచారాన్నే.. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పత్రికా ప్రకటన ఇచ్చారు.
నీరు కలుషితం కాలేదని, స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామని, వారి మరణాలకు నీటికి సంభంధం లేదని పత్రిక ప్రకటన విడుదల చేసి వెళ్లారు..
కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.. ఇప్పటికి మరణించిన వారంతా .. కలుషిత నీరు త్రాగడం వల్లే చనిపోయారని వారి కుటుంబ సభ్యులు , బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .
ఇంతవరకు భుకాయించుకుంటూ మభ్యపెట్టిన అధికార యంత్రాంగం అంతా… తాజాగా రామచంద్రుడు నాయక్ మృతితో వారు ఏ విధమైన నివేదిక ఇస్తారో.. ఈ ముగ్గురు మరణానికి కారణాలేవో అధికారులే చెప్పాలి..
చనిపోయిన వారంతా .. ఎందువల్ల చనిపోయినారో.. తెలియ చేయాలని అధికారులకు కాలనీవాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.