పెద్దిరెడ్డి కుటుంబం ఇరుక్కున్నట్లే !

The Peddireddy family is stuck.!

The Peddireddy family is stuck.!

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంభ సబ్యులంతా అడవిని ఆక్రమించి దశాబ్దాలుగా అనుభవిస్తున్నారని.. అన్ని రకాల చట్టాలను అతిక్రమించారని విజిలెన్స్ రిపోర్టు రెడీ చేసింది. ఎలాంటి కేసులు పెట్టాలో కూడా సిఫారసు చేసింది. అత్యంత కఠినమైన సెక్షన్లు పెట్టాలని .. పెద్దిరెడ్డితో పాటు ఆ భూములను కబ్జా చేసిన ఆయన కుటుంబ సబ్యులందరి పై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది.

ఇటీవల పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం పడవల్లో పెద్దిరెడ్డి చేసిన అడవి కబ్జా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ విలాసవంతమైన నివాసం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే తాను అడవి మధ్యలో ఎప్పుడో ప్రైవేటు భూముల్నికొన్నానని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడపని వాళ్ల కోసం ఆ ప్యాలెస్ కట్టానని అన్నారు. విచారణ జరిపిన అధికారులు ప్రజాధనంతో రోడ్డు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎంత భూమి వారి అధీనంలో ఉంది.. ఎంత భూమి కబ్జా చేశారో లెక్కలు తేల్చారు. మొత్తం వివరాలతో నివేదిక సమర్పించారు.

పెద్దిరెడ్డి .. ఆయన కుటుంబం చేసిన అరాచరం ఇది ఒక్కటే కాదు. జగన్ చెప్పే అడ్డగోలు పనులు చేసి.. దానికి ప్రతిఫలంగా దోపిడీకి లైసెన్స్ తీసుకున్న పెద్దిరెడ్డి కుటుంబం చెలరేగిపోయారు. చిత్తూరు జిల్లాలో చేయని భూదందా లేదు. మద్యం స్కాం మొత్తం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనే మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని కూడా నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం స్కాం మరో సంచలనం కానుంది. చంద్రబాబుపై పలుమార్లు రాళ్ల దాడులు, హత్యాయత్నాలు వెనుక పెద్దిరెడ్డి ప్లాన్ ఉంది. చిత్తూరు,అనంతపురం జిల్లాలలో టీడీపీని తుడిచి పెట్టడానికి వందలకోట్లు ఖర్చు చేశారన్నది ఆరోపణలు ఉన్నాయి., కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలవడానికి ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఆయన పాపం పండించని… బయటపడే చాన్స్ లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. మరి ప్రభుత్వం ఇదే టెంపోను కొనసాగిస్తుందా.. రాజకీయకక్ష సాధింపు అనుకుని వీలైనంత మెత్తగా వ్యవహరిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top