- పెద్దల అమావాస్య (పెత్తర్ల అమాస ) కు పెద్దలను స్మరించుకుంటూ..పూజలు
- ఈ అమావాస్యకు ఎదో ఒక రూపంలో కుటుంబ సబ్యులను చూసి వెళ్తారన్న నమ్మకం
- పెద్దలకు నచ్చిన వంటకాలతో నైవేద్యం..
- నైవేద్యాలు స్వీకరించి .. దీవించి సంతోషంగా తిరిగి వెళ్తారన్న నమ్మకం
- పండుగ చేయని ఇళ్ళలో.. వారిని విస్మరించారన్న భాధతో.. శోకతప్త హృదయాలతో ఎక్కి ఎక్కి ఏడ్చి ఆత్మ దాహంతో ..వారి కన్నీళ్ళు వారె తాగి తిరిగి వెళ్తారట..
- కాకులు ఇంటి ముంగిటకు వస్తే పెద్దలు వచ్చారన్న నమ్మకంతో ..కాకులకు పిండి వంటలు పెట్టి చూస్తూ..ఆనందింప సాగడం
పెద్దల అమావాస్య
పెద్దల అమావాస్య (పెత్తర్ల అమాస ) అంటే పెద్దలను స్మరించుకుంటూ వారికీ పూజలు నిర్వహిస్తారు. ఈ అమావాస్యను ప్రాంతాల వారిగా వివిధ రకాలుగా పిలుస్తారు. కొందరు మహాలయ అమావాస్య, పెత్తర్ల అమావాస్య, పెద్దల అమావాస్య.. ఇలా పేర్లు వేరైనా ఇవన్నీ ఒక్కటే… ప్రతీ ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుంచి అశ్విని మాసం వరకు ఉండే అమావాస్యనే పితృ పక్షం అంటారు. తమను బౌతికంగా వదిలి వెళ్ళిన.., పూర్వీకులను తలచుకుని పెద్దల అమావాస్య నాడు వారికి పూజలు నిర్వహిస్తారు. తద్వారా పితృ దేవతల అనుగ్రహం కలిగి పితృ దోష విముక్తి జరుగుతుందని నమ్మకం.
పెద్దల అమావాస్య నాడు కాకులు ఇంటి ముంగిటకు వస్తే పెద్దలు వచ్చారన్న నమ్మకంతో ..కాకులకు పిండి వంటలు పెట్టి చూస్తూ..ఆనందింప సాగతారు. అంతేకాక ఈ అమావాస్యకు వారు సాయం – సంధ్య వేల వారి ఆత్మ ఇంటిలోకి వచ్చి అన్ని గమనిస్తారట.. వారు బ్రతికి వున్నపుడు ఎ ఏ ఆహారపదార్థాలు వారు ఇష్టంగా తినింటారో.. వాటినే నైవేద్యంగా పెడతారు. ఆహారపదార్థాలే కాకుండా ..ధూమ పానం , మధ్య పానం , ఉన్న వారికీ , వాటిని కూడా నైవేద్యంగా పెడతారు.
పెద్దలకు సాంబ్రాణి వేసి పూజలు
పెద్దల అమావాస్య నాడు పెద్దల ఫోటోల కు దండలు వేసి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఎర్రగా కాలిన నిప్పు కనికలను పెనం మీదకు తీసుకోని ఆ నిప్పులపై సాంబ్రాణి వేసి స్మరించు కుంటూ నివాళులు అర్పిస్తారు. సాంబ్రాణి వేసి నివాళులు అర్పించిన తర్వాత 20 నిమిషాల పాటు ఇంట్లో నుంచి అందరు బయట కూర్చుంటారు . అ సమయంలో పెద్దలు ఇంటి లోకి వచ్చి వారికీ పెట్టిన నైవేద్యాలను స్వీకరించి చాల సంతషపడుతూ.. వారు దీవించి వెళ్తారట .. పూజలు , నైవేద్యాలను విస్మరించిన ఇళ్ళలో ..వారిని విస్మరించారన్న భాధతో.. పెద్దల ఆత్మ శోకతప్త హృదయాలతో ..ఎక్కి ఎక్కి ఏడ్చి దాహంతో .. వారి కన్నీళ్ళు .. వాళ్లే తాగి తిరిగి వెళ్లి పోతారట.. అలా శోకతప్త హృదయాలతో పెద్దలు బాధపడి వెళితే ఆ కుటుంబానికి అంత శ్రేష్కరం కాదని అంటారు. పెద్దల ఆత్మలు సంతోషంగా తిరిగి వెళ్లితే.. వారి ఆశీస్సులే.. కుటుంబ సభ్యులకు అన్నివిధాల శ్రేష్కరం అని అంటారు.
పెద్దల పండుగ
అయితే ఈ పెద్దల పండుగను కులాల వారిగా .. ప్రాంతాల వారిగా .. వేరు వేరు సమయాల్లో ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. అధిక శాతం ప్రజలు పెద్దల అమావాస్యగా పిలువబడిన రోజునే .. జరుపుకుంటారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV