తిరమందార్ల స్పెషల్ బంగి ఉండలు – లివర్ పచ్చడి

Bngi Undalu Lever balls

Bngi Undalu Lever balls

బంగి ఉండలు కేవలం పెద్దల అమావాస్య కు స్పెషల్ గా తయారు చేస్తారు.. తిరమందార్లు పెద్దల అమావాస్య రోజు పెద్దలను స్మరిస్తూ సాంబ్రాణి వేసి నివాళులు అర్పించిన అనంతరం లివర్ ప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీ .. ఈ లివర్ ప్రసాదం కేవలం తిరమందార్లు మాత్రమే ఈ పెద్దల పండుగకు వాడతారు . ఈ లివర్ పచ్చడిని బంగి ఉండలు అంటారు , కొందరు గుండె కాయల చెట్నీ, మటన్ మసాలా ఉండలు , మటన్ బాల్స్ , లివర్ బాల్స్ , మటన్ లడ్డు ప్రసాదం అని రకరకాలుగా పిలుస్తారు .

తిరుమన దార్లు , మోడొల్లు (మోటోళ్ళు)

పెద్దల అమావాస్య పండుగను రెండు విధాలుగా జరుపు కుంటారు .. తిరుమన దార్లు , మోడొల్లు (మోటోళ్ళు) , అని రెండు వర్గాలు ఉంటాయి . తిరుమన దార్లు నాన్ వెజ్ , మోడొల్లు స్వీట్ , లతో జరుపుకుంటారు. ఈ రెండు వర్గాలు ఈ విధమైన పద్దతులు అనుసరించడం పూర్వం నుండి కొనసాగుతుంది. ఇదే విధానాన్ని పెద్ద ఖర్మలకు సైతం తిరుమన దార్లు నాన్ వెజ్ , మోడొల్లు స్వీట్ లతో జరుపుకుంటారు.

పెద్దల అమావాస్య తిరుమన దార్లు అట్టహాసంగా జరుపుతారు.

పెద్దల అమావాస్య నాడు తిరుమన దార్లు అట్టహాసంగా జరుపు కోవడం ఆనవాయితీగా వస్తుంది , మన ,తన బేధాలు లేకుండా అన్ని కులాల వారు.. వారి వారి గ్రామలలో పది కుటుంబాల చొప్పున గ్రూపులుగా ఏర్పడి చందా వసూలు చేసుకుంటారు . ప్రతి గ్రూపుకు ఒక పోట్టేలిని కొనుగోలు చేసి కుప్పలు వేసుకుంటారు . ఒక్కొక్క కుప్పకు , ప్రతి కుప్పకు ఒక బంగి ఉండలు(లివర్ బాల్స్ ) తయారు చేస్తారు. ఆ బంగి వుండ నే సాంబ్రాణి వేసిన అనంతరం ప్రసాదంగా తీసుకుంటారు. ఈ పండుగకు ఎంతటి పేదవారైనా తప్పకుండా పెద్దలకు మటన్ మాత్రమే నైవేద్యంగా పెడతారు.

బంగి ఉండలు తాయారు చేసే విధానం Also Read పెద్దల అమావాస్య ఎందుకు చేస్తారు

పొట్టేళ్ళ కోసిన తర్వాత , పొట్టేలి గుండె కాయ (లివర్ ) , రోమ్మెంక , ఉలవకాయ , కొంత మెత్తని కండ తీసుకోని కడ్డిలకు కూర్చి, కట్టెలతో మంట ఏర్పాటు చేసి .. మంటలో వీటిని బాగా కాలుస్తారు .. బాగా కాలిన తర్వాత , ధనియాలు ,దాల్చిన చెక్క , లవంగాలు , వేడి చేసి పక్కన పెట్టుకొని , ఎల్లిపాయలు , కాల్చిన గుండె కాయలను ,రోమ్మెంక ను , ఉలువ కాయలు , అన్నింటిని కలిపి రోట్లో వేసి దంచుతారు. బాగా దంచిన తర్వాత .. టెన్నిస్ బాల్ సైజ్ లో ఉండలు కడుతారు. కుప్ప కు ఒక ఉండ వేస్తారు.

బంగి ఉండలు రుచి చూడరు..!

పొట్టేలు కోసే సమయానికి అందరూ నియమనిష్టలతో ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి ఒక్కరు స్నానమా చరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బంగి ఉండలు తాయారు చేసేసమయంలో అందులో ఉప్పు, కారం కూడా ఒక అంచనా ప్రకారమే వేస్తారు. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఎటువంటి టెస్ట్ చేయరు. ఎందుకంటే పెద్దలకు నైవేద్యం పెట్టేది కనుక, కేవలం వారికి సాంబ్రాణి వేసిన అనంతరం మాత్రమే ఆ బంగి ఉండలను ప్రసాదంగా తీసుకుంటారు.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top