మొక్కలు మానవారోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయంటే అతిశయోక్తి కాదు. కలుపు మొక్కలపై జరిగిన పరిశోధనల్లో ‘తుంగముస్తల’కు ఔషధ ప్రాధాన్య ముందన్న విషయాన్ని ధ్రువీకరించారు.
వరిపొలాల్లో కలుపుతీసే సమయాల్లో వీటిని విరివిగా సేకరించవచ్చు. ఎన్నో విధాలుగా ఔషధంగా ఉపయోగపడే ఈ తుంగ దుంపలు పచారీ కొట్లలో కూడా చౌకధరకు ఎండినవి లభ్యమౌతాయి.
తుంగముస్తలు, మిరియాల చూర్ణం సమంగా కలిపి పావు స్పూను వంతున రోజూ రెండు మూడుసార్లు తేనెతో సేవిస్తే సాధారణ దగ్గులు తగ్గుతాయి. తుంగముస్తలు, కరక్కాయ పెచ్చులు, శొంఠి చూర్ణాలను సమంగా తీసుకుని అంతే బెల్లం కలిపి నూరి ఉసిరికాయ ప్రమాణం ఉండలు చేసి రోజు రెండు మూడుసార్లు చప్పరించి రసం మింగుతుంటే పొడిదగ్గులు, ఉబ్బసం తగ్గుతాయి.
తుంగముస్తల చూర్ణం ఒక స్పూను ప్రమాణంలో రోజుకి మూడు సార్లు సేవిస్తే రక్త విరేచనాలు తగ్గిపోతాయి. పచ్చి దుంపల్ని నీటితో మెత్తగా నూరి స్తనాలపై లేపనం చేస్తుంటే స్త్రీలలో స్తన్యవృద్ధి జరుగుతుంది.
ప్రయోగశాలలో జరిగిన అధ్యయనాలలో వీటిలో పైనిన్, సినెలాల్, ఓలియక్, స్టియారిక్, మిరిస్టిక్ ఆసిడ్లు, ఒకవిధమైన ఆల్కలాయిడ్, కార్బోహైడ్రేట్లు మొదలగు అంశాలున్నట్లు కనుగొన్నారు. వట్టివేర్లు, సుగంధి పాల, తుంగముస్తల చూర్ణాల్ని సమంగా చేసి తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటుంటే శరీరంలో అధికవేడి తగ్గి కళ్ళు మంటలు, మూత్రంలో మంట, నొప్పి, బాధ తగ్గుతాయి. రెండు స్పూన్ల తుంగముస్తల చూర్ణాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి అరగ్లాసు నీరు మిగిలేలా మరగించి చల్లార్చి వడకట్టిన కషాయంలో ఒక చెంచా అశ్వగంధ’ చూర్ణం కలిపి సేవిస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులు, పోట్లు తగ్గుతాయి. రోజూ రెండుసార్లు వాడాలి.
Also Read అందానికి, సౌందర్యానికి..కలబంద
తుంగ దుంపలపై జరిగిన పరిశోధనల్లో తక్కువ ప్రమాణంలో మూత్రకారి 1 గాను, ఎక్కువ ప్రమాణంలో మూత్ర సంగ్రాహిగాను పనిచేసినట్లు గమనించారు. తుంగముస్తల చూర్ణం, తమలపాకులు సమంగా కలిపి కొద్దిగా తేనెవేసి . మెత్తగా నూరి సెనగలలాగా మాత్రలు చేసి బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే నోటి దుర్గంధం తగ్గుతుంది. ఒక భాగం చిక్కటి పాలకు, మూడొంతుల నీళ్లు కలిపి అందులో ఇరవై తుంగముస్తల్ని వేసి పాలు మాత్రమే మిగిలేలా మరగించి, చల్లార్చి, వడగట్టి తాగుతుంటే అధిక ధూమపానం, మద్యపానం వల్ల కలిగే పైత్యవికారాలు, చికాకు తగ్గటమే కాక సుఖనిద్ర పడుతుంది. • దుంపల్ని మెత్తగా నూరి తేలు కుట్టినచోట పట్టిస్తే బాధ, మంట, నొప్పి ” తగ్గుతాయి.
పొడిని కలిపి స్నానం చేస్తుంటే శరీర దుర్వాసన తగ్గుతుంది
షడంగపానీయం, గంగాధర చూర్ణం, ముస్తకారిష్ట వంటి ఆయుర్వేదౌషధాల తయారీలో కూడా ఈ తుంగముస్తల్ని ఉపయోగిస్తారు. తుంగముస్తలు, వట్టివేళ్ళు, గంధకచోరాల చూర్ణాలను ఒక్కొక్కటి వంద గ్రాములు చొప్పున కలిపి వుంచుకుని బకెట్ నీటిలో ఒకట్రెండు స్పూన్ల పొడిని కలిపి స్నానం చేస్తుంటే శరీర దుర్వాసన తగ్గుతుంది. రోజూ రెండుసార్లు కప్పు నీటిలో ఒకస్పూను తుంగముస్తల చూర్ణం కలిపి అరకప్పు కషాయం మిగిలేలా మరిగించి దించి గోరువెచ్చగా వున్నప్పుడు వడగట్టి త్రాగుచుంటే ఐ.బి.యస్. అనే మాటి మాటికి తరచుగా విరేచనాలు కావటమనే సమస్య తగ్గుతుంది. తుంగముస్తల చూర్ణం, ఏలకుల చూర్ణం సమానంగా కలిపి వుంచుకుని పూటకు పావు స్పూను పొడిని తగినంత తేనెతో కలిపి రెండు పూటలా వాడుతుంటే అతిగా దప్పిక అయ్యే సమస్య తగ్గుతుంది.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
#tungaGaddalu #tungaBottelu #tungaMustelu #tungaMustala #tungaGaddi #tunga