జనసేన సిద్ధాంతాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్దాం…
అనంతపురము అర్బన్ లోని 50 డివిజన్లలో ప్రత్యేక క్యాంపులు…
పది రోజులు క్షేత్రస్థాయిలో…
63 మండలాల్లో సభ్యత్వ డ్రైవ్..
సభ్యత్వాల నమోదులో అనంతపురము అగ్రగామిగా నిలుపుదాం…
జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా..
పది రోజులు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేసి సభ్యత్వాల నమోదులో అనంతపురము జిల్లాను అగ్రగామిగా నిలపాలని..
జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు పిలుపునిచ్చారు. గురువారం అనంతపురము జనసేన పార్టీ కార్యాలయంలో..
ఆయన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహణ ప్రధాన కార్యదర్శి శ్రీ భవాని రవికుమార్,
నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, రాయలసీమ రీజనల్ ఉమెన్ కోఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జయరామిరెడ్డి,
శ్రీ అంకె ఈశ్వరయ్య, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
జనసేన పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందన్నారు. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో..
యువత జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధినేత సిద్ధాంతాలను పార్టీ విధానాలను..
క్షేత్రస్థాయిలో వివరించి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయాలన్నారు. 18 నుండి 28వ తేదీ వరకు పది రోజులపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న..
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
63 మండలాల్లో సభ్యత్వం నమోదు డ్రైవ్ నిర్వహించాలన్నారు. అనంతపురము అర్బన్ నియోజకవర్గంలోని 50 డివిజన్లలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి,
జనసేన పార్టీ సభ్యత్వాల రెన్యువల్, నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు అయిన తర్వాత..
తొలిసారి నిర్వహిస్తున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సూచించారు. ప్రభుత్వంలో ఉన్నందున కష్టపడిన వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు.
నామినేటెడ్ పోస్టులు ఒక్కటే కాదు మున్సిపల్, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా ఎన్నో అవకాశాలు ఉంటాయని చిత్తశుద్ధి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి
రూ.500/- తో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏడాది పాటు ప్రమాద జీవిత బీమా రూ. 5లక్షలు, ప్రమాద బీమా రూ. 50వేల వరకు ఉంటుందని వివరించాలన్నారు.
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పట్ల ఆసక్తిగా ఉన్న వారిని క్రియాశీలక సభ్యులుగా చేర్చడమే ఇప్పుడు జనసైనికులుగా..
మన ముందు ఉన్న లక్ష్యం అని శ్రీ టీ.సీ.వరుణ్ గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు శ్రీ రాపాధనంజయ్, శ్రీ సంజీవ రాయుడు, శ్రీ కిరణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీమతి.జయమ్మ, శ్రీ ఆవుకు విజయకుమార్, శ్రీ ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు శ్రీ గ్రంధి దివాకర్, నగర ప్రధాన కార్యదర్శులు శ్రీ మేదర వెంకటేష్, శ్రీ రొల్ల భాస్కర్, శ్రీ కమటం వెంకటనారాయణ, శ్రీ హిమామ్ హుస్సేన్, శ్రీ kls చోటు, శ్రీ దరాజ్ భాష, నగర కార్యదర్శిలు శ్రీ కుమ్మర మురళి, శ్రీ లాల్ స్వామి, శ్రీ రాజేష్ ఖన్నా, శ్రీ సంపత్, శ్రీ వల్లంశెట్టి వెంకటరమణ, శ్రీ ఆకుల ప్రసాద్, శ్రీ కాశీం మరియు కార్యక్రమాల కమిటీ సభ్యులు శ్రీ sku రమణ, శ్రీ సంతోష్, శ్రీ మధు, వీరమహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి దాసరి సరిత, శ్రీమతి మంజుల, శ్రీమతి విజయలక్ష్మి నాయకులు శ్రీ వెన్నెల కృష్ణ, శ్రీ చైతన్య కృష్ణ, శ్రీ బండమీదపల్లి గోపాల్, శ్రీ ఎం.వి. శ్రీనివాస్, శ్రీ దంపెట్ల శివ, శ్రీ హిద్ధూ, శ్రీ రమణ, శ్రీ ప్రసాద్, శ్రీ గోవర్ధన్, శ్రీ విజయ్ రాయల్, శ్రీ చిన్న, శ్రీ నవీన్ కుమార్, శ్రీ నౌషద్ తదితరులు పాల్గొనడం జరిగింది.