విజయనగరం ఈ పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు , ఒకటి శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యం రెండోది పూసపాటి విజయనగరం కోట
ఈ రెండు వేరు వేరు గురించి ఆయన విజయనగర సామ్రాజ్యం గురించి చాలామందికి తెలిసినా మన ఉత్తరాంధ్రలోనే ఉన్న
విజయనగరం కోట గురించి పూసపాటి వంశం గురించి మాత్రం స్థానికులను మినహాయించి బయట వారికి చాలా తక్కువ విషయాలు తెలుసు నని చెప్పాలి.
విజయనగరం కోటను నిర్మించిన పూసపాటి రాజులది సూర్యవంశం క్రీస్తుశకం 514 నుంచి 592 వరకు దక్షిణ భారతదేశంలో ..
మాధవ వర్మ నాయకత్వంలో బెజవాడని రాజధానిగా చేసుకుని వీరు రాజ్యాన్ని పరిపాలించారు. మాధవ వర్మ కు సంబంధించిన వారే పూసపాటి వంశస్థులు..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఒకప్పుడు విజయనగరం ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర, ఉత్తర సర్కార్ అనిపించేవారు. మొఘల్ భాషా షేర్ ఖాన్ కు పూసపాటి వారే సహాయం చేశారు అని చరిత్ర చెబుతోంది.
అందుకు బహుమతిగా కుమిలి ,బొగపురం ప్రాంతాలను పూస పాటి వారికి మొఘల్ చక్రవర్తి బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది.
ఆరోజుల్లో కుమిలిని కుందులపురం అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో పూసపాటి వారు మట్టి కోటను నిర్మించి రాజ్యాన్ని ప్రారంభించారు.
ఔరంగాజేబు గోల్కొండ పై దండేయాత్ర
అయితే 1686లో ఔరంగాజేబు గోల్కొండపై దండేత్తి కుతుబ్షా వంశాన్ని సర్వనాశనం చేశాడు. ఈ యుద్దంలో ఔరంగాజేబుకు పూస రాజు..
సహాయంచేశారని చెబుతారు. అందుకు ఔరంగాజేబు వాడే జరుతికర్ అనే కత్తిని పూసపాటి రాజుకు బాహుకరించారని ఇచ్చారని చరిత్ర చెబుతోంది.
వారు వాడే రెండు మనలు ఉండడం విశేషం కత్తితోపాటు పూసపాటి వారికి మహారాజా అనే పేరును కూడా బహుకరించారు.
1713లో ఒక బాబా సలహా మేరకు మొదటి ఆనందరాజు ఈ కోటకి శంకుస్థాపన చేశారు కోట నిర్మించిన నాలుగు సంవత్సరాలకు రాజు మరణించారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పెద్ద విజయ రామరాజు ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. పెద్ద విజయ రామరాజు రాజధాని ని కుమిలి నుంచి మార్చి కలింగ విజయనగరానికి నాంది పలికారని చరిత్ర పరిశీలకులు రామకృష్ణ చెబుతున్నారు.
పూసపాటి వంశానికి ప్రస్తుతం పెద్దదిక్కుగా అశోక్ గజపతిరాజు ఉన్నారు వారి తర్వాత తరాలు మన దేశంలో రాజకీయాల్లో కొంతమంది విదేశాల్లోనూ నివసిస్తున్నారు.
పూసపాటి వంశీయులు తమ ఆస్తులు కంటే సమాజానికి సేవనే ప్రధమ కర్తవ్యం గా భావించేవారు అందుకే అనేక ట్రస్ట్ లను ఏర్పాటు చేసి పూరి విరాళాలు ఇచ్చే వాళ్ళు,
పాఠశాలలను మహిళా కళాశాలలో ఏర్పాటు చేశారు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ఉచితంగా విద్యనుఅభ్య శిస్తున్నారు. దేశానికి ఆఖరి కోటగా చెప్పుకునే విజయనగరం కోటలో చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
కేవలం విద్యార్థులే కాకుండా ఈ కోటను చారిత్రక సంపదగా చూడడానికి వచ్చే పర్యాటకులు ఉంటారు పూసపాటి వంశీల వైభవాన్ని తెలుసుకొని వారు ఆశ్చర్యపోతుంటారు.