రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధులు శ్రీ అనంత్ అంబానీ లు జిల్లాకు రాక నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన :ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్, ఐపీఎస్., గారు
ప్రకాశం జిల్లా, పిసి పల్లి మండలం, దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి ఈ నెల 2న గౌరవ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధులు శ్రీ అనంత్ అంబానీ తదితరులు విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్, ఐపియస్., గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు. ఆనంతరం పర్యటన నిమిత్తం నియమించిన ప్రత్యేక అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు తెలియచేశారు.
హెలిప్యాడ్ ప్రదేశం, సభాస్థలంలో డయాస్, బ్యారికేడింగ్, విఐపి మరియు జనరల్ పబ్లిక్ పార్కింగ్, చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. చుట్టూ ఉన్న ప్రదేశమును డ్రోన్ కెమెరాతో జిల్లా ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో డయాస్, పార్కింగ్ ఏరియా, హెలిప్యాడ్ నుంచి డయాస్ వరకు ఉన్న రూట్ ను, స్టాల్స్ ప్రదేశమును క్షుణ్ణంగా పరిశీలించి, మంత్రి గారి పర్యటన సజావుగా జరిగేలా భద్రతా మరియు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు వచ్చే ప్రదేశం, వెళ్ళే ప్రదేశం లో ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూమి పూజ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ గారు వెంట కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కనిగిరి సీఐ ఖాజావలి,ఆర్ఐ రమణారెడ్డి, పిసిపల్లి ఎస్సై కోటయ్య మరియు సిబ్బంది ఉన్నారు.