- రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రివర్యులు
- ఆత్మకూరులో జరిగే ఉమామి తబ్లిగే ఇస్తామా పనులను పరిశీలించిన
- మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో 2025 సంవత్సరంలో జనవరి 7.8.9 వ తేదీల్లో ఆత్మకూరులో జరగబోయే ఉమామి. తబ్లిగే ఇస్తామా ఏర్పాట్లను శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.యం.డి ఫరూక్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు ముస్లిం మత పెద్దలు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ ఆత్మకూరులో జరగబోయే ఉమామి తబ్లిగే ఇజెమా కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఇస్తామాకు వచ్చే వారు పోలీస్ వారికి రెవెన్యూ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ల వారికి సహకరించాలన్నారు.
ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అక్కడున్నటువంటి అధికారులకు తెలియజేయాలని తెలిపారు అలాగే ఇస్తామాను జయప్రదం చేయాలని కోరారు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో నన్నూరు టోల్ ప్లాజా దగ్గర కూడా ఇస్తామాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తామాకు 10 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు అప్పుడు అధికారుల సహకారంతో ఇస్తామను జయప్రదం చేయడం జరిగిందని అలాగే మరొకసారి జిల్లాలో ని ఆత్మకూరు ఇస్తామాకు అవకాశం కల్పించడం ఆ అల్లా దయనే అని ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని కోరారు అలాగే ఇస్తామాకు వచ్చేవారి కోసం నిర్వాహకులు కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా కమిటీ వారు అన్ని చర్యలు తీసుకుని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఇస్తామాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్ని శాఖల అధికారుల సహకారంతో ముందుకెళ్లాలని కోరారు.
కమిటీలను ఏర్పాటు చేసుకొని అందరి కోఆర్డినేషన్ తో వనులు చేసుకోవాలని తెలిపారు ఇస్తామాకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే మాకు తెలియజేయాలని అలాగే ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గంలో ఇస్తామాను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఏర్పాట్లను సౌకర్యాలను శరవేగంగా నిర్వహిస్తామన్నారు. ఇస్తామా ను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్ని శాఖలతో కలిసి కోఆర్డినేషన్ తో పనిచేయాలని చెప్పారు మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మైనార్టీ అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.
పోలీసుల రక్షణ
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అలాగే పార్కింగ్ కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే హెల్ప్ డిస్క్ ను కూడా ఏర్పాటు చేస్తామని ఏదైనా సహాయం కావాలంటే అక్కడ అడిగి సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి నందికొట్కూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ అధికారి నాగజ్యోతి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు నీటి సరఫరా విభాగం ఏఈ పకీరయ్య అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్యశాఖ మండల అభివృద్ధి శాఖ పలు శాఖల అధికారులు అధికార పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్