బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ఉన్న సాయిశ్వర్ హత్య కేసు కొట్టివేసిన విజయవాడ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు
సాయిశ్వర్ హత్య కేసులో కోర్టు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సాయిశ్వర్ హత్య కేసు బుధవారం విజయవాడ ఫాస్ట్ ట్రాక్ సాక్ష్యదారాలు నిరూపన కానందున కేసు కొట్టివేస్తూ నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు నిందితులందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
కేసు కొట్టి వేతపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాటల్లో వినండి లింకు ను ఓపెన్ చేసి వినండి
2014 మార్చి నెలలో జరిగిన సాయిశ్వర్ హత్య కేసు సుమారు 12 సంవత్సరాల సుధీర్గ విచారణ అనంతరం సాక్ష్యదారాలు నిరూపణ కానందున ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయ మూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందన : న్యాయం గెలిచింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, రాయలసీమ ఉద్యమం తన నాయకత్వంలో ఉదృతంగా జరుగుతున్న సమయంలో కొందరు తనపై ఈ తప్పుడు కేసు బనాయించారని, కర్నూలు, విజయవాడ ప్రత్యేక కోర్టు ( ఫాస్ట్ ట్రాక్ ) ల చుట్టూ సుమారు 12 సంవత్సరాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురై తిరిగామని అన్నారు.