శ్రీశైలంలో ఓట్ ఫర్ ధ్యాంక్యూ కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్దానికులతో ప్రారంభించారు. చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగున చర్యలు చేపట్టామని తెలిపారు.
శ్రీశైలంలోని కొత్తపెట సుగాలి కాలనికి చెందిన ప్రదేశాలలో స్దానికుల సమక్షంలో ప్రభుత్వ పధకాలను వివరించారు స్దానికులకు మంచినీరు రోడ్లు వైద్యం విద్యా నివాస స్దలాల సమస్యలను త్వరలోని తీరుస్దామని వారికి హామి ఇచ్చారు ముఖ్యంగా స్దానిక సమస్యలు కాలనీలలోని మౌలిక వసతులపై దృష్టి సారించామని ఎవరికైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్దానికులను కోరారు ఓటర్లందరు వారి ఓటు హక్కును వినియోగించుకుని తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారని అందుకే ఓట్ ఫర్ ధ్యాంక్యూ కార్యక్రమాన్ని శ్రీశైలంలో మొదటిసారిగా నిర్వహించామని అందరికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వికలాంగులకు వితంతువులకు అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సమావేశంలో ఎమ్మెల్యే స్దానికులకు భరోసా ఇచ్చారు వచ్చే నెల నుంచి అర్హులైన వారందరికి ప్రభుత్వం పించన్లు అందిస్తుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వివరించారు ఓట్ ఫర్ ధ్యాంక్యూ కార్యక్రమానికి స్దానికులు కార్యకర్తలు బారీగ తరలివచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి విన్నవించుకున్నారు.
