వాలంటీర్ల సేవలను ప్రశంసించిన.. నంద్యాల MLA రవి

Nandyala-MLA-Ravi-appreciated-the-services-of-the-volunteers-scaled.jpg

వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది…. ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి

-వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పురస్కారాల అందజేత

-వాలంటీర్ల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే

  • రానున్న కాలంలో వాలంటీర్ల వ్యవస్థ మరింత భలోపేతం

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో అలాగే పురసేవలను స్థానికంగా తమ నివాస ప్రాంతా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయ సేవలను ప్రజల ముంగిటకు, గడప చెంతకు తీసుకురావడానికి ప్రజలకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలను అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా స్వచ్చంద సేవకులుగా ఉంటూ ప్రజలకు తలలో నాలుకగా సేవలను అందిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లను ప్రభుత్వం గుర్తించి సేవా మిత్రా, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను, నగదును అందించడం జరుగుతున్నది. మంగళవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా స్థానిక టౌన్ హాల్ నందు నంద్యాల నంద్యాల టౌన్ పరిధిలోని వార్డు సచివాలయాల పరిదిలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు, ప్రశంసాపత్రాలు, నగదు అందజేశారు. వాలంటీర్ల సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లు అందించే సేవలు మరువలేనివని, వారు కుటుంబంలో సభ్యులలాగ, మమేకమైపోయారని పేర్కొన్నారు. వీరి సేవలను గుర్తించి వరుసగా ప్రతి ఏడాది పురస్కారాలను, నగదును అందజేస్తున్నామన్నారు. భవిషత్తులో వాలంటీర్ వ్యవస్థను మరింత భలోపేతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో…. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, ఏపీఎస్సీడీసీఎల్ డైరెక్టర్ డా.శశికళారెడ్డి, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృ తరాజ్, బెస్తసంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, శిల్పా మహిళా సహకార్ చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి, ఏపీ. ఎమ్మెస్ .ఎం .ఈ. డైరెక్టర్ కాజీ అబుల్ కలం, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు టివి రమణ, వైసిపి నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ వార్డు ఇన్చార్జీలు వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top