హలో విద్యార్థి చలో విజయవాడ
నవంబర్ 18 విజయవాడలో జరిగే ధర్నా జయప్రదం చేయండి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం నవంబర్ 18 వ తేదీ విజయవాడలో జరిగే మహా ధర్నా కార్యక్రమం విజయవంతం కోసం రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, బీఫార్మసీ,సి ఫార్మసీ వంటి ఉన్నతమైన విద్యలో మూడు విడతల వరకు వసతి దీవెన విద్యా దీవెన 3480 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వాటి సాధన కోసం విద్యార్థుల పక్షాన గళం వినిపించడం కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా విజయవాడ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలో నిర్వహించుటకు కోసం సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ఫీజులు కట్టడం కోసం కళాశాల దగ్గరికి వెళ్తే గతంలో మూడు విడతలు వసతి దీవెన విద్యాధీవన పెండింగ్లో ఉన్నాయి మొత్తం బకాయిలు చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటా మిమ్మల్ని పరీక్ష కు అనుమతిస్తామని చెబుతూ విద్యార్థులు మానసికంగా నైతికంగా ఒత్తిడి గురి చేస్తున్నారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం లేదు .
అదేవిధంగా ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నేను అధికారంలోకి వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకం పునప్రారం ఇస్తానని చెప్పి అధికారంలోకొచ్చి 150 రోజులు గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ గురించి మాట్లాడడం లేదు అదేవిధంగా పేద మద్ద తరగతి విద్యార్థులు సంక్షేమానికి దూరంగా ఉంటూ సంక్షేమ హాస్టల్స్ లో విద్యను అభ్యసిస్తున్నారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఇప్పటికే చాలా సంక్షేమ హాస్టల్స్ వర్షాలు వచ్చిన సందర్భంగా వర్షం నీరు తో కారణం గోడలు కూలడం కనీసం ఉండడానికి వసతి లేక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శిథిల వ్యవస్థలో చేరుకున్న సంక్షేమ హాస్టల్ ను పునర్మానం చేయాలి అదే విధంగా ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుకూలంగా సంక్షేమ హాస్టల్స్ లో నెలకు 3000 రూపాయలు మెస్ బిల్లులు పెంచాలి దానితోపాటు ఎన్నికల్లో హామీలో భాగంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలి..
పీజీ విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించాలి,ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం అర్హులుగా ప్రకటించి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలి,అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి,డిగ్రీలో నాలుగు సంవత్సరాల విధానం రద్దు చేసి మేజర్ మేనేజర్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ విధానం రద్దుచేసి ప్రభుత్వ విద్యను కాపాడాలని సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేయడం కోసం నవంబర్ 18 వ తేదీన విజయవాడలో మహా ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు హారిక మేఘన హారిక రజిని కావ్య వలి గౌతమ్ అరవింద్ జీవన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్