సంగమేశ్వరంలో..ఆంద్ర – తెలంగాణ మధ్య ఘర్షణ

VideoCapture_20230101-223824.jpg

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర కృష్ణానది లో బోటు తిప్పే విషయంలో తెలంగాణ, ఆంధ్ర బోటు డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది.ఇరు వర్గాల మధ్య మాటకు మాట పెరగడంతో తోపులాట జరిగింది .విషయం తెలుసుకున్న కొత్తపల్లి ఇన్చార్జి ఎస్ఐ అశోక్ ఘర్షణ స్థలానికి చేరుకుని గొడవకు గల కారణం పై ఆరా తీశారు.

ఆంధ్ర – తెలంగాణ మధ్య ఘర్షణ దేనికి ..?

ఆంధ్ర – తెలంగాణ మధ్యలో ఉన్న కృష్ణ పరివాహ ప్రాంతం సంగమేశ్వరం దగ్గర వున్న బోటింగ్ పాయింటు నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఇంజన్ బోట్లు (పడవలు) నడుపుతూ ప్రయాణికుల్ని ఇక్కడి నుండి అవతలి ఒడ్డుకు అక్కడినుంచి ఇవతలి ఒడ్డుకు చేరుస్తుంటారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల బోటు డ్రైవర్ల మధ్య వివాహం చోటుచేసుకుంది ఈ వివాదానికి గల కారణం ప్రయాణికుల మధ్య డబ్బులు వసూలు చేసే విషయంలోను..అందులోనూ ఒక యూనిటీ లేకుండా ఎవరు పడితే వారు పడవలు నడపడం వల్ల ఘర్షణకు దారితీసింది. ఎక్కువ శాతం ఆంధ్ర ప్రదేశ్ నుంచి సంగమేశ్వరం దగ్గర ఈ ఇంజన్ బోట్లు ఎక్కి అవతలి ఒడ్డు కొల్లాపురానికి చేరుకుంటారు.

సంగమేశ్వరం నుంచి పడవల ద్వారా కొల్లాపురానికి

  ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రజలకు తెలంగాణలోని సమీప గ్రామాల్లో బంధువర్గం ఎక్కువ వుండటంతో.. కొల్లాపురానికి చేరుకోవాలంటే ఆత్మకూరు మీదుగా కర్నూలు చేరుకొని కర్నూలు నుంచి కొల్లాపురానికి పోవాల్సి ఉంటుంది..చుట్టూ తిరిగి రావాలంటే సుమారు 120  కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే సంగమేశ్వరం నుంచి పడవల ద్వారా కొల్లాపురానికి చేరుకోవాలంటే కేవలం 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. అందుకని ఇక్కడ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇంజన్ బోట్లు ఎక్కువ శాతం నడుపుతుంటారు. అయితే ఈ ఇంజన్ బోట్లకు మాత్రం ఎలాంటి అనుమతులు ఉండవు. ప్రయాణికులు మాత్రం వారి ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని అవతలికి దాటాల్సిందే.. 

సంగమేశ్వరంలో ప్రమాదం 

    2004లో ఒకేసారి ఇదే సంగమేశ్వరం దగ్గర  ఇంజన్ బోటు  మునిగి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  కానీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు కానీ నిబంధనలు కానీ బోటు డ్రైవర్లకు -  యజమానులకు ఎటువంటి హుకుం జారీ చేయడం లేదు. యదేచ్చగా బోటు డ్రైవర్లు ఎలా పడితే అలా నడుపుదు ప్రయాణికుల దగ్గర ఎంత పడితే అంత గుంజుతూ ఉంటారు. ఇలా ఎవరు పడితే వారు పడవలు నడపడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యులు.

   ఆంధ్ర ప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రజలకు తెలంగాణలోని సమీప గ్రామాల్లో బంధువర్గం ఎక్కువ వుండటంతో.. కొల్లాపురానికి చేరుకోవాలంటే ఆత్మకూరు మీదుగా కర్నూలు చేరుకొని కర్నూలు నుంచి కొల్లాపురానికి పోవాల్సి ఉంటుంది..చుట్టూ తిరిగి రావాలంటే సుమారు 120  కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  అదే సంగమేశ్వరం నుంచి పడవల ద్వారా కొల్లాపురానికి చేరుకోవాలంటే కేవలం 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. అందుకని ఇక్కడ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇంజన్ బోట్లు ఎక్కువ శాతం నడుపుతుంటారు. అయితే ఈ ఇంజన్ బోట్లకు మాత్రం ఎలాంటి అనుమతులు ఉండవు. ప్రయాణికులు మాత్రం వారి ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని అవతలికి దాటాల్సిందే.. 2004లో ఒకేసారి ఇదే సంగమేశ్వరం దగ్గర  ఇంజన్ బోటు  మునిగి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  కానీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు కానీ నిబంధనలు కానీ బోటు డ్రైవర్లకు -  యజమానులకు ఎటువంటి హుకుం జారీ చేయడం లేదు. యదేచ్చగా బోటు డ్రైవర్లు ఎలా పడితే అలా నడుపుదు ప్రయాణికుల దగ్గర ఎంత పడితే అంత గుంజుతూ ఉంటారు. ఇలా ఎవరు పడితే వారు పడవలు నడపడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి బాధ్యులు.    

సంగమేశ్వరం సమీపంలోని సిద్దేశ్వర దగ్గర రెండు రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానది.. రెండు కొండల మధ్య ఐకానిక్ బ్రిడ్జిని (తీగెల వంతెన) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రిడ్జిని 2000 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు.
రాష్ట్రాలకు మధ్య రవాణా సౌకర్యార్థం చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడే అవకాశం ఉంది.

Read This

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top