తెలంగాణ పీసీసీ కొత్త బాస్ ఎవరు..! ఢిల్లీలో సీనియర్ నాయకుల గస్తీ

Who is the new boss of Telangana PCC

Who is the new boss of Telangana PCC

జూలై 7తో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు కాబట్టి, ఇప్పుడు ఆ పదవిలో మరొక సీని యర్ నేతను నియమిం చాల్సి ఉంది. టీపీసీసీ బాస్‌ను ప్రకటించే సమయం సమీపిస్తుండ డంతో పార్టీలోని ఆశావ హులు ఇప్పటికే దిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈ విషయమై రాష్ట్రంలోని కీలక నాయకుల నుండి అభిప్రాయాలను తెలుసు కుంటోంది. టీపీసీసీ చీఫ్ ఎంపిక పనిలో దీపాదాస్ మున్షీ పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్తవారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతీయ నాయకత్వాన్ని కోరారు.

ఈ దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. సామాజిక సమీకరణలు కూడా పీసీసీ అధ్యక్ష ఎంపికలో కీలకంగా మారనున్నాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన కీలక నాయకులు ఢిల్లీ లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాలుగైదు రోజులుగా హస్తినలోనే ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దిల్లీకి వెళ్లారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి పీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

టీపీసీసీ చీఫ్ రేసులో ఎవరె వరు… తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నాయకులు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్ని స్తున్నారు. ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కింది. డిప్యూటీ సీఎం పదవి దళిత సామా జిక వర్గానికి కేటాయిం చారు. రాష్ట్ర జనాభాలో 50 శాతా నికి పైగా ఉన్న బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నాయకులు కోరుతు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవిని కేటాయించిన సమయంలో బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ లు బీసీ సామాజిక వర్గం నుండి ఈ పదవికి రేసులో ముందంజ లో ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కని కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసినా మధు యాష్కీ గెలవలేదు. రాహుల్ గాంధీతో మంచి సంబంధాలున్న యాష్కీ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుండి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top