ఆంధ్రప్రదేశ్ డిజిపి కార్యాలయం మంగళగిరి..
మహిళల భద్రతకు "శక్తి వాట్సప్ నంబర్" 7993485111
మహిళలు మరియు చిన్నారుల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ
తీసుకొచ్చిన "శక్తి" యాప్ అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి విదితమే.
మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్" శక్తి వాట్సప్ నంబర్ 7993485111 అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
నేడు మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా శక్తి వాట్సప్ నంబర్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నంబరు కాల్ (వీడియో, నార్మల్ కాల్), మేసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళ్లిన వెంటనే శక్తి టీమ్స్ సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు.
24/7 ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సాంకేతికత సహాయంతో మహిళలు మరియు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టడం జరుగుతుందని తెలిపారు.
మహిళలు విధిగా తమ మొబైల్ లో ఈ శక్తి వాట్సప్ నంబర్ ను సేవ్ చేసుకోవలసిందిగా ఐజీపీ శ్రీమతి బి. రాజకుమారి కోరారు.
ఈ కార్యక్రమంలో "ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐజీపీ శ్రీమతి బి. రాజకుమార్, ఎస్పీ శ్రీమతి శ్రీదేవి రావు తదితరులు పాల్గొన్నారు.
సందేశాన్ని జారీచేసినవారు
రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ వారి కార్యాలయం, మంగళగిరి.
#Shakti WhatsApp number..7993485111
శక్తి వాట్సప్ నంబర్..7993485111

Shakti WhatsApp number..7993485111