రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం – pushpa2

2 crore compensation to Revathi's family

2 crore compensation to Revathi's family

రేవతి కుటుంబానికి 2 కోట్ల పరిహారం

హైదరాబాద్:డిసెంబర్ 25

సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్‌ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్‌ ఎలమంచిలి రవి. అనంతరం బాలుడు శ్రీతేజ్‌ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అతడి కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.

ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప 2 నిర్మా తలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వ నున్నట్లు తెలిపారు. ఈరోజు ఎఫ్‏డీసీ ఛైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు.

అనంతరం బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి అతడికి ధైర్యం చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ సంస్థ భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 4న సంధ్య థియే టర్ వద్ద జరిగిన తొక్కిస లాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో రేవతి కుమారు డు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులె టిన్స్ విడుదల చేస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రి వర్గాలు.

#pushpa2 #alluarjun #alluaravind #cmrevanthreddy #tgcmrevant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top