ఏపి ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని రైతు పాసు పుస్తకాల ఖాతాకు విశిష్ట సంఖ్యను రిజిస్ట్రేషన్ చేయాలి
డి.చిన్నప్పయాదవ్
జిల్లారైతుసంఘము అద్యక్షులు
సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నార్పల మండల తాసిల్దార్ కార్యాలయం దగ్గర జిల్లా రైతు సంఘం అధ్యక్షులుడి.చిన్నప్పయాదవ్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి గంగాధర ,రైతుసంఘముమండల కార్యదర్శి లలితమ్మ ఆధ్వర్యంలో ధర్నా.
ఏపి ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని రైతు పాసు పుస్తకాల ఖాతాకు విశిష్ట సంఖ్యను రిజిస్ట్రేషన్ చేయాలనిరైతాంగసమస్యలపై మంగళవారం సీపీఐ నాయకులు తహసిల్దార్ అరుణ కుమారిగారికీ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
డి. చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ ,
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రైతు పోలము సర్వే నంబర్లకు ఫార్మా రిజిస్ట్రేషన్(APFR) పథకమును తీసుకోచ్చినెలలుగడుస్తున్నా పక్రియముందుకు సాగలేదు.కేవలం సర్వే నంబర్ల పైన విశిష్ట నంబర్ సంఖ్యను రిజిస్ట్రేషన్ చేస్తే ఖాతా లో ఉన్న మిగతా సర్వే నెంబర్లు కనుమరుగే అయ్యే అవకాశం ఉంది. గతంలో రీ సర్వే వల్ల తప్పిదాలు జరిగినట్లు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు సూచించాల్సిన విషయాలు ఏమిటంటే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అనే నిబంధన లేకుండా అన్ని భూములకు పాసు పుస్తకంలో ఉన్న అన్ని సర్వే నంబర్లకు విశిష్ట నంబర్లను కేటాయించాలి. పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ పథకం, మరియు పంట నష్టపరిహారం, పంటల బీమా పథకాలు,పంట ఋణాలపై వడ్డీరాయితీ,సబ్సీడిపై యంత్ర పరికరాలు,రాయితీ పై సూక్ష్మపోషకాలు,సూక్ష్మసేద్యం పై రాయితీ,పంటఋణాలు,పథకాలు రైతులకు నష్టం కల్గకుండా ఉండే అవకాశం ఉంటుంది.విశిష్ట గుర్తింపు నెంబర్ పాస్ పుస్తకాల్లో ఒక ఒకే సర్వే నెంబరుకు మాత్రమే చేయడం జరిగిందని వ్యవసాయ అధికారులు చెప్పడం జరుగుతున్నది ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వము రైతులకు ఇబ్బందులు లేకుండాచూడాలిమరియుHLC కాలువక్రింద పంటలు వరి,వేరుశనగ,కాయగూరలపంటలు కోతదశలో ఉన్నాయి కాని నీరురాక ఎండిపోతున్నాయి తక్షణమే పంటలకునీరువధలాలనిసీపీఐ~రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సుధాకర్,వ్యవసాయకార్శికసంఘముమండలకార్యదర్శి పెదపెద్దయ్య,పెద్దక్క,నారాయణప్ప, నారాయణమ్మ, కుళ్ళయమ్మ,సంజీవరాయుడు,బాషా,శ్రీదేవి,అరుణమ్మ,ఇంద్ర,రమాదేవి, భవాని, లక్ష్మి నారాయణ , కిష్టయ్య,తదితరులు పాల్గొన్నారు.