యువ పోరుతో వైసీపీ దొంగాట
- యువత భవితను దెబ్బతీసింది జగనే
- ఉద్యోగాల కల్పవృక్షం చంద్రబాబు
- యువత భవిత లోకేష్ తోనే సాధ్యం
- శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.
ఆత్మకూరు : యువపోరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగాట ఆడుతోందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆరోపించారు. గడచిన వైసీపీ ప్రభుత్వ హాయంలో యువత భవిష్యత్తును నాశనం చేసేలా రూ.4,271 కోట్లు ఫీజు, వసతి దీవెన బకాయిలు పెట్టి నేడు ఏ మొఖంతో ధర్నాలు చేస్తారని ప్రశ్నించారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే. దాన్ని జగన్ 9 లక్షల మందికే కుదించి, 7 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అంతేకాక 6 లక్షల మంది నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగభృత్తి ఇవ్వగా… దాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసి యువతకు ద్రోహం చేసిందన్నారు.
నాడు జగన్ 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీయస్సీ హామీలపై మాట తప్పి మడమ తిప్పారన్నారు. కమిషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేసి జగన్ ప్రభుత్వం పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి రాష్ట్రంలో నిరుద్యోగం పెంచిందన్నారు. రాజకీయ స్వార్థం కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లపై దుష్ప్రచారం చేసి వాటిని నాశనం చేసి రాష్ట్రంలో నిరుద్యోగం పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టభద్రుల్లో నిరుద్యోగం 24% జగన్ పాలనలో పెరిగి దేశంలో ఏపీ మొదటి స్థానం చేరడమే కాకా 2100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల ఊసు లేదు కానీ ఇక్కడ చూసిన గంజాయి, డ్రగ్స్ తో యువత భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు.
ఉద్యోగాల కల్పవృక్షం చంద్రబాబుగారే.. యువత భవిత లోకేష్ గారితేనే సాధ్యం
2014-19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 12 లక్షల ఉద్యోగాలు కల్పించి చంద్రబాబు గారు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి కల్పవృక్షంగా నిలిచారన్నారు. 2014లో ఏపీలో ఐటీలో 5 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండగా… 2019 నాటికి ఐటీ మంత్రి నారా లోకేష్ గారు 35 వేలకు పెంచారన్నారు. ప్రస్తున ఎన్డీయే ప్రభుత్వ హాయంలో మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు జూన్ లోపు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారని, 6,100 పోలీసు నియామకాలు చేయబోతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 4 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేయడం జరుగుతున్నదన్నారు. నైపుణ్య గణనకు ఇన్ఫోసిస్ తో ఒప్పందం జరిగిందాని దాని ద్వారా 2 లక్షల మందికి విదేశాలలో ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నది. యువపోరు పేరుతో మరోసారి యువతను మోసం చేసేందుకే జగన్నాటకం ఆడుతున్నారు. ఉద్యోగాల కల్పన చంద్రబాబుకే సాధ్యం. యువత భవిత లోకేష్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు.