ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోండి – సర్పంచ్ ప్రహల్లాద యాదవ్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని డివిజన్ పరిధిలోని ప్రజలు త్రాగునీటికి కొరత లేకుండా ఉన్నారని.. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి టిడిపి నాయకులకు మింగుడుపడటం లేడని అది ఓర్వలేకే ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విరుపాపురం సర్పంచ్ ప్రహల్లాద యాదవ్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైసిపి కార్యాలయంలో విరుపాపురం సర్పంచ్ ప్రహల్లాద యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ప్రహల్లాద మాట్లాడుతూ.. టిడిపి నాయకులు పనిగట్టుకొని ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని అలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

ఆదోని డివిజన్ పరిధిలోని ఆస్పరి CPWS స్కీమ్ నుండి ఆదోని మండలలో నాగనాతనహళ్లి,ధనాపురం, నారాయణపురం, చాగి, సాదాపురం, విరుపాపురం, దిబ్బనకల్లు, గోనబావి మరియు
ఆస్పరి మండల పరిధిలో బినిగేరి ,నగరూర్, చిగిలి,హాలిగేరా, చిరుమాన్ దొడ్డి, శంకరబండ, తంగరడోన,తురవగల్లు, ఆస్పరి , ఆలూరు మండల పరిధిలో , కమ్మరచేడు మూసన హళ్లి కాత్రికి,
మొత్తం 20 గ్రామాలకు రోజు విడిచి రోజు ఆస్పరి స్కీము నీళ్లు వెళ్తున్న ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీల వాళ్లు కొంతమంది గిట్టని వాళ్లు నీళ్లు రావడంలేదని ప్రచారం చేయడం సరికాదని విరుపాపురం సర్పంచ్ ప్రహల్లాద యాదవ్ మండిపడ్డారు . ఇకనైనా వాస్తవాలు మాట్లాడి విలువలాను కపడుకోవాలని సర్పంచ్ ప్రహల్లాద యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో విరుపాపురం సర్పంచ్ ప్రహల్లాద యాదవ్,
బినిగెరి సర్పంచ్ వెంకటేష్చి , రుమాన్ దొడ్డి సర్పంచ్ నాగమ్మ, ఆస్పరి ఎంపీపీ భర్త రామాంజనేయులు, నారాయణపురం సర్పంచ్ భర్త పురుషోత్తం రెడ్డి, హాలిగేరా సర్పంచ్ నాయుడు
నగరూరు సర్పంచ్ మోహన్ పాల్గొన్నారు .
