ఆశావహుల్లో సందడి.. టిడిపికి 2. జనసేనకు 1..
నాగబాబుకు రాజ్యసభ సిటు వారించ నుందా ?
అమరావతి, నవంబర్ 20
రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరగాల్చిన ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 30వ తేదీ ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలతో పాటు, ఒడిశా, హర్యానా, పశ్చిమ బెంగాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 10 వరకూ నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణ 20 వ తేదిన ఉప ఎన్నికలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురికీ రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ అవకాశం ఇచ్చింది.
రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశా వహుల్లో సందడి ప్రారంభం అయ్యింది. ఇప్పటికే రెండు విడతల నామినేటెడ్ జాబితాను ప్రకటించారు. చాలామంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు. ఈ మూడు రాజ్యసభ పదవుల్లో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు కోటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి అయదేవ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాగా గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
ఈ ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన అభ్యర్ధన మేరకు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖరకు టిక్వెట్ ఇచ్చారు. ఆయన గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అందుకే గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. మరోవైపు జనసేనకు ఒక రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే అవకాశం మెగా బ్రదర్ నాగబాబుకి అన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు కృషి చేశారు. కూటమీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు మంచి పదవి వరించ బోతోందని అని ప్రచారం సాగుతోంది.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్