Article by ———- సగినాల రవి కుమార్ – 8309888954
ఎన్ఎస్టిఆర్ పరిధిలో పెద్దపులుల అభయారణ్యంలో వేసవి కాలంలో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4పెద్దపులులు, 6 చిరుత పులులు మృతి చెందిన సంఘటనలు ఉన్నట్లు అటవీశాఖ అధికారుల ఘణంకాలు తెలుపుతున్నాయి. గత సంవత్స రంలో ఆత్మకూరు రేంజ్ గుమ్మడాపురం గ్రామ సమీపంలో తల్లిపులి మనుగడ ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పవచ్చు. ఆ పులి ఆచూకి నేటికి అటవీశాఖ అధికారులకు అంతు చిక్కలేదు. వెలుగోడు రేంజ్లో ఓ పెద్దపులి ఉచ్చులో పడి మృతి చెందిన సంఘటన అధికారులందరికి తెలసిందే. శ్రీశైలం శిఖరం, హటకేశ్వరం సమీపాలలో రోడ్డు ప్రమాదంలో ఓ పెద్దపులి రెండు చిరుత పులి పిల్లలు మృత్యుఘోష పడ్డాయి.
బైర్లూటి నాగులూటి రేంజ్ల రెండు సరిహద్దులో కర్నూలు గుంటూరు జాతీయ రహాదారిపై బైర్లూటి చెక పోస్టు సమీపంలో రోడ్డు దాడుతున్న ఓ చిరుత పులిని ఆర్టిసి బస్సు డికొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. గత సంవత్సర కాలం నుంచి నల్లమల అడవులో పెద్దపు లులు, చిరుత పులులు పదుల సంఖ్యలో మృతి చెందవచ్చని వన్యప్రానుల ప్రేమికులు వాపోతున్నారు. ప్రస్తుతం వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో నల్లమల అడవిలో నీటి కుంటలు, సాసర్ పీట్స్లో నీళ్ళు నిల్వలేక ప్రతి రోజు వన్యప్రానులు రైతుల కంట గ్రామీణ ప్రాంత ప్రజలకు కనిపిస్తునే ఉన్నాయి.
ఉచ్చులను తోలగించడంలో విఫలమైన అటవీశాఖ అధికారులు…
గడిచిన సంవత్సరంలో వన్యప్రానుల వేటగాళ్లు నల్లమల అటవీ ప్రాంతంలో తరుచుగా వన్యప్రానులను వేటాడుతునే ఉన్నారు. ఉచ్చులను వేస్తూ నీటి ప్రవహిత ప్రాంతాలలో వన్యప్రానులను వేటా కొనసాగించి వాటిని మాంసంను జోరుగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. 24గంటలు విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు ఉచ్చులను తొలగించడంలో విఫలం మైయ్యారని చెప్పవచ్చు. నాగులూటి, బైర్లూటి, వెలుగోడు, శ్రీశైలం, ఆత్మకూరు రేంజ్ లో తరుచుగా వన్యప్రానుల వేట కొనసాగుతునే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుసగుసలు మొదలైయ్యాయి. మరో వైపు వన్యప్రానులను వేటగాళ్ళను నామమాత్రంగా పట్టుకోని కేసులు పెట్టారే తప్పా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అవగాహాన కల్పించడంలో విఫలం మైయ్యారని చెప్పవచ్చు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
నాటుతుపాకులతో వన్యప్రానుల వేట…?
అటవీకి సమీపంలోని పలు గ్రామీణ ప్రాంతాలలో వన్యప్రానుల స్మగ్లరులు నాటుతుపాకులతో రాత్రి వేళ సమయంలో వన్యప్రానుల వేటను కొనసాగిస్తున్నట్లు వన్యప్రానిప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు వన్యప్రాని అటవీ డివిజన్ పరిధిలోని ఏదో ఒక గ్రామంలో వన్యప్రానుల మాంసం విక్రయాలు ఉపందుకున్నాయి. కిలో వందలలో మార్కెట్లో పలుకుతుంది. చుట్టు బేసు క్యాంపులు, సైకింగ్ పోర్సు, మొబైల్ టీమ్లు ఉన్నప్పటికి రేంజ్ అధికారుల కొరత అధికంగా ఉండడంతో నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రానులను నాటుతుపాకులతో వేట కొనసాగించడానికి అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైన్నప్పటికి వరుసగా జరుగుతున్న వన్యప్రానుల ప్రమాదాలలో పెద్దపులి, చిరుత పులులను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య దోరణితో విందులు, చిందులు వేస్తూ విధులు నిర్వహిస్తున్న కొంత మంది సిబ్బందిపై నిఘా ఉంచడంలో అటవీశాఖ విజులెన్సు అధికారులు విఫలమైయ్యారని చెప్పవచ్చు.