బనగానపల్లె పట్టణంలో ఈద్గా నగర్ లో డ్రైనేజీ కాలువలు ను పరిశీలించిన రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఈద్గా నగర్ లో డ్రైనేజీ కాలువలను మొదటిసారిగా రోడ్లు భవనాలు శాఖ మంత్రి హోదాలో పర్యటించిన బీసీ జనార్దన్ రెడ్డి.
బనగానపల్లెలో ఎన్నికల ముందు ప్రచారం డోర్ టు డోర్ తిరిగి ప్రతి వీదిలో సమస్యలు ను తెలుసుకోవడం జరిగిందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ముఖ్యంగా బనగానపల్లె పట్టణంలో డ్రైనేజీ సమస్యల గురించి గత ఐదు సంవత్సరముల కాలంలో నామమాత్రంగా డ్రైనేజీ పుడుకతీతల పనులు చేయడం జరిగింది. పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత పందులు తిరగడం ఇంటి పక్కన మురికి కాలువలు ఉండడంతో దుర్వాసనకు వారు సంసారం చేయడనికి కూడా విరక్తి వస్తుందని తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం లో ఉన్న శాసనసభ్యులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్లు విజిట్ చేయకుండా కేవలం అధికార దర్పం తప్ప ఎక్కడ పనులు చేయలేదు ఒక వేళ చేసింటే వాళ్ల కార్యకర్తల కోసము 50 మీటర్లు 100 మీటర్లు డ్రైనేజీ పనులు చేసి ఉంటే చేసి ఉండొచ్చు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడీ అక్కడే ఉందని ఆయన అన్నారు.
ఈరోజు ఆ డ్రైనేజీ పనులు విజిట్ చేసిన తరువాత మంత్రి హోదాలో ప్రజల బాధను చూసి నాకే బాధ అనిపించింది.
డ్రైనేజీ పనుల కోసం 8 రోజుల ప్రోగ్రాం పెట్టించి 150 మంది మేస్త్రీలతో జేసిబి లు పెట్టి డైనేజి కాలువ లను శుభ్రపరచడం జరుగుతుందని మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి తెలిపారు..