నంద్యాల జిల్లా..బనగానపల్లె పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది …
మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అనుచరులు.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేయడంతో … తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.. అనుచరుడు మహమ్మద్ ఫైజ్ .. కుమారుడి వివాహం జరుగుతుండగా ..మంత్రి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు..
వివాహ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి వచ్చిన ఫోటో.. వీడియో గ్రాఫర్లు.. తమ డ్రోన్ కెమెరాతో ..పెళ్లి కుమారుడి ఇంటిని చిత్రీకరిస్తున్న సమయంలో… పక్కనే ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి వైపు డ్రోన్ కెమెరా వెళ్లిందన్న .. సాకుతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు.. పెళ్లి ఇంటిపై పాల్పడ్డారు..
పెళ్లికి వచ్చిన..పలువురిపై తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా. చంటి పిల్లలు, ఆడ వాళ్లని అని చూడకుండా..విచక్షణ రహితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు.. అంతేకాకుండా.. ఫోటో వీడియో గ్రాఫర్ల కెమెరాలను లాక్కొని నేలకేసి బాధడంతో కెమెరాలు ధ్వంసం అయ్యాయి.. అయ్యా మేము మంత్రిగారి ఇంటిని చిత్రీకరించడం లేదంటూ.. ఫోటో గ్రాఫర్లు కాల్లా వేల్ల పడి.. బతిమిమిలాడినా…బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కనికరం చూపలేదు..
తమపై మంత్రి అనుచరులు దాడి చేశారని.. మహమ్మద్ ఫైజు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా .. పోలీసులు సైతం.. మంత్రి అనుచరులకే వత్తాసు పలికుతూ.. వీరిపై దురుసుగా ప్రవర్తించారు..
ఈ దాడి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా… వెంటనే కాటసాని రామిరెడ్డి రంగంలోకి దిగి తన అనుచరులతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు ..అనంతరం తమ అనుచరులపై దాడికి పాల్పడ్డారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన..చర్యలు తీసుకోకపోతే.. సహించేది లేదని ఖడాకండిగా పోలీసులను హెచ్చరించారు.. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని., శాంతి భద్రతలు విచ్చిన్నమై సామాన్యుడు స్వేచ్ఛ గా బ్రతికే రోజులు కరువయ్యాయని..కాటసాని రామిరెడ్డి ఫైర్ అయ్యాడు..