బనగానపల్లె పట్టణం రంగరాజుపేట లో కల సిఎస్ఐ చర్చ్ పర్సనైజ్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు….
బనగానపల్లె పట్టణం రంగరాజుపేట లోకల సిఎస్ఐ చర్చి పర్సనైజ్ భవనాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ప్రారంభించారు. సి ఎస్ ఐ చర్చికి ఫాదర్ గా పనిచేస్తున్న డివిజనల్ ఇంచార్జి రెవరెండ్ ఆల్బర్ట్ ఆయన సతీమణి క్రిస్టి ఆల్బర్ట్ లు నివాసానికి నూతన భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణ ప్రారంబోత్సవానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు , రెవరెండ్ డాక్టర్ ఐజక్ వరప్రసాద్ గారు ఆయన సతీమణి భారతి ఐజాక్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ డివిజనల్ చైర్మన్ రెవరెండ్ ఆల్బర్ట్ గారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. సి ఎస్ ఐ చర్చ సభ్యులకు ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా తన వద్దకు రావచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ప్రసాద్, కన్వీనర్ మనోహర్, ట్రెజరర్ ఐడియా కరుణాకర్ ,సంఘ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.