తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ – AP CM , TS CM Meeting

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - AP CM , TS CM Meeting

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - AP CM , TS CM Meeting

 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ:నూతన శకం మొదలైనట్టేనా..!

ఆంధ్ర,తెలంగాణ, రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపు తున్న అంశం ఏదైనా ఉందంటే అది ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశమే.. 

అటు చంద్రబాబునాయుడు గురించి అందరికీ తెలిసిన విషయమే. అలాగే రేవంత్ రెడ్డి గురించి కూడా ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరి మధ్య ఉన్న గాఢానుబంధం కూడా ఎవరికీ తెలియందేం కాదు.

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడం అందుకు రేవంత్ రెడ్డి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయాయి.

మరి ఆ ఇద్దరి మధ్య చోటు చేసుకోబోయే చర్చాంశాలేంటి..

ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక అసాధారణమైన సమావేశం చోటు చేసుకోబో తోంది. వ్యక్తిగతంగా ఎంతో చనువున్న ఇద్దరు ముఖ్య మంత్రులు 6,వ తేదీన హైదరాబాద్ లో సమావేశం అవుతున్నారు.

వారిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకోవడంలో పెద్ద చెప్పుకోదగ్గ అంశాలేమీ లేకపోయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రు లుగా కలుసుకోవడమే ఆసక్తి రేపుతోంది.

ఆంద్రప్రదేశ్ నుండి చంద్రబాబునా యుడు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల హోదాలో కలుసుకోబోతుండడంతో రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అనేక సమస్యలు ఇక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి, కృష్ణా జలాలే కీలకంగా మారుతున్నాయి. అయితే పలు సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల పంపిణీ ఈపాటికే జరిగి ఉండేదని ఏపీ ముఖ్యమంత్రులు మొండి పట్టుదలకు పోయి విషయాలను జటిలం చేస్తున్నారన్న వ్యాఖ్యలు ఉన్నాయి.

అయితే ఇటీవల చంద్ర బాబునాయుడు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తాను భేషజాలకు పోబోవడం లేదని రెండు రాష్ట్రాల మధ్య నలుగుతు న్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పడం విశేషం.

తన ముందున్న లక్ష్యాల్లో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును పూర్తి చేయడమేనని చెప్పడం కొసమెరుపు. మరోవైపు బహుశా ఇలాంటి అనేక అంశాలు దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు స్వయంగా రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఉంటారని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఈసారి రెండు రాష్ట్రాలు సమస్యల పై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయన్న అం చనాలు పెరుగుతున్నాయి. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషదగ్గ విషయమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top