ఒకే వేదికపై నరేంద్ర మోడి , చిరంజీవి , పవన్ కళ్యాణ్ కనిపించడంతో .. అభిమానుల్లో నూతన ఉచ్చాహాన్ని నింపించి ఈ అద్బుత గట్టం చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కనివినడు చేసింది.
కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు..అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన.. కార్యక్రమమం మొత్తంలో హైలెట్‌గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.
ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు. దీనిని మెగస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు.
ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజినోవా విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగిన అద్భుతమైన వేదిక వద్దకు వచ్చారు. వేదిక మీద చిరంజీవి అనుక్షణం పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోతుంటే, వేదిక కింద నుంచి చూస్తున్న మిగిలిన వారు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్నపుడు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు.. అందరి మోముల్లో పవన్ పట్ల వారికున్న వాత్సల్యం.. ఇలా ఒక్కటి కాదు రకరకాల ఎమోషన్స్ అక్కడ కనిపించాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రధాని మోదీ చేసిన పని మరో ఎత్తుగా నిలిచింది. పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ఆకాశానికి ఎత్తేసింది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి అయిన వెంటనే ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దర్నీ చెరో చేత్తో పట్టుకుని వేదిక మధ్యకు తీసుకు వచ్చారు. వారిద్దరినీ ఆలింగనం చేసుకుని ఇద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు. దీంతో చిరంజీవి భావోద్వేగంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ బుగ్గలు నిమురుతూ సంబర పడిపోయారు. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా.. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ప్రాధాన్యం చూసి ఆశ్చర్యపోయారు
