తెలుగు వారి నూతన సంవత్సర ప్రారంభం అయిన “ఉగాది” పండుగ ఎప్పుడు చేయాలి?? ఎలా చేయాలో?? మీ కోసం….
తేది 30:3:2025 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి యుగాది (ఉగాది) ఆ రోజు ఉదయం అనగా తేది 29-3-2025 శనివారం క్రొత్త అమావాస్య రాత్రి ( తెల్లవారుజామున తెల్లవారితే ఆదివారం) 3 గంటలు నుంచి ఆదివారం ఉదయం 7:15 లోగా నువ్వుల నూనె శరీరమునకు వ్రాసుకుని స్నానము (తిల తైల అభ్యంగన) చేయవలెను. తదుపరి ఏరువాక, నవవస్త్రధారణకు,దైవ దర్శనమునకు,షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడి క్రొత్తగల్చుటకు గానూ శుభయుక్తముగా ఉన్నది. ఆదివారం ఉదయం 9:24 నిమషములుకు రేవతి నక్షత్ర యుత వృషభ లగ్నమున పసుపు, బెల్లం,బంగారం, వెండి క్రయ విక్రయములుకు (కొనుగోలు అమ్మకములు) చిట్టా, ఆవర్జా క్రొత్త పుస్తకములు వ్రాయుటకు (పడమర మినహా) మిగతా అన్నిదిక్కులకు వ్యాపారం కై వెళ్లుటకు సాయంత్రం 4 లోగా శుభ యుక్తముగా యున్నది…
అలాగే తేది 29-3-2025 శనివారం ఫాల్గుణ బహుళ అమావాస్య ఆరోజు ఉదయం సముద్ర నదీ తటాక ” కూప “(బావి )స్నానములకు జప దాన అనుష్ఠానములకు పితృ దేవతలకు ప్రీతిగా తిల తర్పణములు మరియు స్వయం పాకములు ఇచ్చుట శాస్త్ర వచనం. మీకు నిర్దేశించిన సమయమునకు మీ మీ పురోహితులు వచ్చి కార్యక్రమము జరిపించు కోవచ్చు..
ఇట్లు
మీ పురోహితులు
గుడిమెట్ల చిట్టిపంతులు