- మురిపించిన ముష్టపల్లె
- అడుగడుగునా శిల్పా అభివృద్ధి సంతకం
ఆత్మకూరు వెళ్లి ముష్టపల్లె ఎక్కడ అని అడగండి…
ఈ కింద చెప్పిన ఏదో వాక్యం మీకు సమాధానం గా వినిపిస్తుంది.
చూడ చక్కని పల్లె ముష్టపల్లె అది…
అభివృద్ధికి ఐకమత్యానికి పెట్టింది పేరు. శ్రమైక జీవనం వెల్లి విరుస్తుంది. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం. ఆ తర్వాత ఆ ఊసు కూడా ఎత్తరు. ఆ విభేదాలు కూడా ఉండవు. ఎవరి రాజకీయాలు వారివి…
ఆ విధంగా ఆత్మకూరు మండలం లోనే బహు మంచి గ్రామం ముష్టపల్లె గ్రామం
ఇలా ఇంకా ఎన్ని జవాబులైనా వస్తాయి.
ముష్టపల్లె అంటే అభివృద్ధికి చిరునామా…
ఏమిటి ఆ ఊరి గొప్పదనం..?
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
- ముష్టపల్లె విజయ గాధ
ఆ ఊరు ఆత్మకూరు పట్టణానికి 10 కి మీ పరిధి లోనే ఉంది. అయినా 2015 వరకూ అభివృద్ధికి ఎన్నో ఆమడల దూరం లో ఉండేది.
ఊరికి చేరాలంటే కంకర తేలిన తారు రోడ్డు. వానొస్తే ఊరంతా మురికి నీటి మడుగులు. రక్తం పీల్చే దోమల ముసురు. అందుబాటులోనే సిద్దాపురం చెరువు.. అయినా నీరందక గుండె చెరువు.
ఊర్లో కూడా ఒక చెరువు ఉంది. అది పేరుకే ఊట చెరువు.
కరువోస్తే ఊట లేక ఎండిపోయిన చెరువు వెక్కిరిస్తుంది.
ఈ 7 ఏళ్ల లో పరిస్థితి మొత్తం మారిపోయింది.
అభివృద్ధికి అసలైన చిరునామా గా మారిపోయింది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ముష్టపల్లె దశ మార్చాలి అని శిల్పా చక్రపాణి రెడ్డి సంకల్పించాడు.
ఎమ్మెల్సీ గానూ, ఎమ్మెల్యే గానూ అభివృద్ధి లో ఉరకలెట్టించాడు.
- ముష్టపల్లె నుంచి, ఆత్మకూరు వరకు 10.కి మీ..BT రోడ్డు
2.ముష్టపల్లె నుంచి బాపనంతాపురం వరకు BT రోడ్డు - B.C, S.C, S.T కాలనీ లకు 30 లక్షలు తో CC రోడ్డు
- పొలం రాస్తాలకు గ్రావెల్ రోడ్లు
- ఊట చెరువు కు 3 లక్షలు సొంత నిధులతో పైప్ లైన్
- జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి మంచి నీటి కొల్లాయి.
- రు 80 లక్షలు తో ముష్టపల్లె గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైస్సార్ క్లినిక్
- రు.30 లక్షలు తో డ్రైనేజీ కాల్వ నిర్మాణం
- రు.15 లక్షలు తో 55 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు
- నాడు నేడు కింద రు 20 లక్షలతో ముష్టపల్లె ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ…
ఇంతేకాదు…
సిద్దాపురం పెండింగ్ పనులు పూర్తి చేయించడం వల్ల 3 కార్ల కు సాగునీరు అందుతోంది. - ముష్టపల్లె గ్రామానికి తూర్పు దిక్కున ఉన్న ఊట చెరువుకు.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తన సొంత డబ్బులు 60 వేల రూపాయలతో సిద్దాపురం చెరువు కాలువ నుంచి ఊట చెరువుకు నీళ్ళు మళ్లించాడు ..
ఊట చెరువు కళ కళ లాడుతోంది..
మొత్తానికి ఆ ఊర్లో వ్యవసాయం ఇప్పుడు పండుగే అయింది.
ఇలా చెప్పుకుంటూ పొతే అడుగడుగునా శిల్పన్న అభివృద్ధి సంతకం కనిపిస్తుంది.
అందుకే నేమో.. గడప గడప కూ మన ప్రభుత్వం కార్యక్రమం సందర్బంగా శిల్పన్న తిరుగుతుంటే తమ ఆత్మ బంధువు వచ్చినట్టు గా గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా ఆనంద డోలికల్లో మునిగి తేలుతూ .. స్వాగతించారు. #mustapalle #mustepalle #mustapalleVillage #mlaSilpachakrapanireddy