నల్లమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు రక్షణ కరువైంది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు త్రాగునీరు లేక అవి సమీప గ్రామాలకు రావడం మొదలుపెట్టాయి. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి అడవులను వదిలి సమీప పంట పొలాల్లోకి రావడం.. చివరికి గ్రామాల్లోకి రావడం మొదలుపెట్టాయి. అడవి జంతువులైన జింకలు , దుప్పులు, మనమేగం, కనితి, కొండ గొర్రెలు .. లాంటి వన్యప్రాణులను వీధి కుక్కలు వెంటబడి పీకు తింటున్నాయి. ఇప్పటికి ఆత్మకూరు నల్లమల్ల అటవీ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో వందలాది వన్య ప్రాణులు వీధి కుక్కల బారినపడి మరణించడం జరిగింది. అటవీశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ నిమ్మకునిరెత్త నట్లుగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది. వాటికి అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ ఫిట్లకు అంటే నీటి కుంటలకు నీరు అందించకుండా..ఉండడమే దీనికి ప్రదాన కారణం. వాటికి సరైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వారు చేసే ఆ చిన్నపాటి పొరపాట్లే వాటి ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. రక్షణ కల్పించాల్సిన ఆటవీ ఆధికారులే .. వన్యప్రాణులకు శాపంగా మారారు.
ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టెపల్లె గ్రామంలోకి వచ్చిన అడవి దుప్పులపై వీధి కుక్కలు దాడి చేశాయి.. ఈ కుక్కల దాడిలో ఒకటి మరణించగా మరొకటి తీవ్రంగా గాయపడింది.. మరో మూడు దుప్పులు కుక్కలు దాటినుంచి తప్పించుకొని స్వల్ప గాయాలతో అడవిలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.. గాయపడిన దుప్పిని స్థానికులు రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు .

ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లోకి తరచూ వన్యప్రాణులు వస్తున్నా... అటవీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. నల్లమల్ల అడవిలో వన్యప్రాణులకు కావలసిన వసతులు సమకూర్చడంలో విఫలం అవడంతోనే అడవులను వదిలి గ్రామాల బాట పడుతున్నాయని..గ్రామస్తులు చెబుతున్నారు.. ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం వన్యప్రాణులు గ్రామంలోకి రావడం .. కుక్కల దాడిలో మరణించడం , గాయపడటం తరచూ జరుగుతూనే.. ఉన్నాయని వాపోతున్నారు. ఇకనుంచైనా అడవిలో ఏర్పాటు చేసిన సాసర్ ఫీట్లకు (నీటికుంటలు ) నీరు పోసి వాటి దాహార్తిని తీర్చి.. వాటికి సరైన రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.