కడప జిల్లా, రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగ,యువతి,యువకుల నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం,వలసల నివారణ కోసం, యువతి,యువకుల ఉపాధి కోసం జిల్లాలో కడప ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ…..కడప నగరంలోని పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సందర్భగా ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (పిఆర్ఎస్ వైఎఫ్) రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ…..
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కడప జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అని గతంలో కడప ఉక్కు,రాయలసీమ హక్కు అనే నినాదంతో ప్రజలు,యువత,నిరుద్యోగులు అనేకమైన పోరాటాలు నిర్వహించి పాలకవర్గాలు పైన ఒత్తిడి పెంచడం ద్వారా శంకుస్థాపన చెయ్యటం జరిగింది. 2007 లో అప్పటి సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి , ఆ తర్వాత 2018 లో సీఎం చంద్రబాబు నాయుడు , 2019 మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి , పలు దఫాలుగా శంఖు స్థాపనలకు మాత్రమే ఉక్కు పరిశ్రమ పరిమితం చెయ్యటం జరిగింది. జిల్లా వాసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించి జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పిస్తారని , నమ్మి ఆశతో 2019 ఎన్నికల్లో అందరూ ఓటు వేసి, వేయించి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించటం జరిగింది.
అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత తన సొంత జిల్లా ప్రజలను,నిరుద్యోగ యువతను మరిచి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చెయ్యకుండా గాలికి వదిలేసి, ఎన్నికలకు 1 సంవత్సరం ఉండగా శంకుస్థాపన చేసి బడ్జెట్ కేటాయించకుండా..జిల్లా ప్రజల, నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో 2018 లో ఎన్నికల ముందు ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసి శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి, ఇప్పటికైనా కడప జిల్లా ప్రజల యువత ఆకాంక్షను గుర్తించి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించి కేవలం ఎన్నికల శంకుస్థాపనలకు పరిమితం కాకుండా బడ్జెట్ కేటాయించాలని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కడప జిల్లా ప్రజల యువత ఆశలకు అనుగుణంగా కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని వారు కోరారు,కడప ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తే ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 30 నుంచి 50 వేల ఉద్యోగాలు పరోక్షంగా 50 వేల నుంచి 1 లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువతీ,యువకులకు లభించే అవకాశం ఉందని వారు తెలిపారు.
కావున ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ పైన స్పష్టమైన ప్రకటన చేసి పరిశ్రమను వెంటనే నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో కడప ఉక్కు పరిశ్రమ కోసం మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని వారు తెలిపారు.