• జాతీయ రహదారుల ఏర్పాటులో అధికారుల అలసత్వం
• గ్రామాలకు దారులు మూసేస్తుండటంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు
ఆత్మకూరు రూరల్: అభివృద్ధికి చిహ్నాలుగా ఉండాల్సిన జాతీయ రహదారులు పల్లె వాసుల రాకపోకలకు అడ్డంకిగా మారుతున్నాయి.గ్రామాల వద్ద దారి వదలకుండా నిర్మిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు-గుంటూరు స్టేట్ హైవేను 340 సి జాతీయ రహదారిగా అప్ గ్రేడ్ చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టారు.
కానీ కర్నూలు నుంచి ఆత్మకూరు వచ్చే లోపు చాలా చోట్ల ఈ రహదారిని లింక్ చేసి ఉండే గ్రామీణ రోడ్లకు దారి తెన్ను లేకుండా పోయింది.
అందుకే రోజు ఈ మార్గంలో ఆయా గ్రామాల ప్రజలు రోడ్డెక్కి ఉద్య మిస్తున్నారు. ఆత్మకూరు పట్టణానికి బైపాస్ గా 340 సి వెళ్తుంది.
ఇలా వెళ్తున్నందున బైపాస్ ఆత్మకూరు -నంద్యాల ప్రధాన రహదారిని, ముష్టపల్లె పీఆర్ రోడ్డును దాటుకుంటూ పోవాల్సి వస్తోంది.
అందువల్ల ఆత్మకూరు – నంద్యాల ప్రధాన రహదారిని అండర్ పాస్ చేస్తూ బ్రిడ్జి నిర్మాణమవుతోంది. కానీ ఇదే మార్గంలో ఉన్న ముష్ట పల్లె రోడ్డును విస్మరిం చారు.
ఈ మార్గంలో ముష్టపల్లె, సిద్దపల్లె, డైరీ కొట్టాల, పెద్దనంతాపురం, కొంతమేర సిద్దాపురం గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి.ఈ ఐదు గ్రామాల్లో సుమారు పదివేల జనాభా ఉంటోంది.
ఈ గ్రామాలలో ప్రాథమిక విద్య తప్ప ఉన్నత పాఠశాలలు లేనందున విద్యార్థులు ఈ మార్గం నుం చే రాకపోకలు సాగించాల్సి ఉంది. ఏ చిన్న పనికైనా గ్రామస్తులు ఇదే మార్గం గుండా ఆత్మకూరు చేరు కోవాలి.
కానీ ఈ రహదారిని జాతీయ రహదారి మూసి వేస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు అనివార్యంగా బై పాస్ రోడ్డులో ఉన్న సర్వీస్ రోడ్డు వెంట అటు గీతా హోటల్ వరకు వెళ్లి కాని ఇటు ఆత్మకూరు నంద్యాల ప్రధాన రహదారి అండర్ పాస్ గుండా కానీ ప్రయాణించాల్సి వస్తోంది.
ఇది కనీసం రెండు 5లోమీటరు దూరం ఎక్కువ పెంచు తోంది.
అదీగాక స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులు వారు ప్రయాణించే ఆటోల వంటి వాహనాలలో నిర్మా ణుష్య ప్రదేశాల గుండా వెళ్లాల్సి ఉండడంతో వారి భద్రత ప్రశ్నార్థకమవుతోంది.
నిజానికి సరిగ్గా ముష్ట పల్లె రోడ్డును 340సి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రదేశంలో ఒక కాంక్రీట్ నిర్మాణం జరుగుతోంది.
అది చూసి ఆయా గ్రామాల ప్రజలు అది వారి దారి కోసం నిర్మిస్తున్న అండర్ పాస్ అనుకున్నారు.
కానీ అదే మార్గంలో క్రాస్ అవుతున్న పీతుర్ వాగుపై నిర్మిస్తున్న చిన్న పాటి బ్రిడ్జి అని అర్థమయ్యే సరికి నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
పీతుర్ వాగు ఇంకొంచెం ముందుకే ప్రవహిస్తూ ఉన్నా ఎవరి ప్రయోజనం కోసమో మరి దాన్ని ముష్టపల్లె రోడ్డుపైకి తెచ్చి నిర్మిస్తున్నారు.
ముష్టపల్లె దారిలో రాకపోకలకు కలిగే ఇబ్బందు లను ఏకరువు పెడుతూ హైవే కాంట్రాక్టర్కు ప్రజలు విన్నవించుకున్నారు కూడా.
హైవే కాంట్రాక్టర్ తెలు గుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు మాత్రమే గాక, ప్రభుత్వంలో కీలకమైన బంధువులు ఉన్న వ్యక్తి కావడంతో పనులు ఆపి ప్రజల విజ్ఞప్తులు పట్టించుకునే స్థితిలో లేరు.
అధికారులే ఇందుకోసం పూనుకుని అటవీ ప్రాంత గ్రామాలైన ముష్టపల్లె, సిద్దపల్లె, వాటి మజరా గ్రామాలకు రహదారి వస తిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.