ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ ను మోడల్ బస్టాండు గా తీర్చిదిద్దుతామని, ప్రయాణికులకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వ ర రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ డిపోలో ఎమ్మిగనూరు-నెల్లూరు (2), తిరు పతి (1), కర్నూలు- గూడూరు (1) 4 కొత్త బస్సులను ఎమ్మెల్యే బీవీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎమ్మిగ నూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు.. ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలే దని, కూటమి ప్రభుత్వం వచ్చాక 6 నెలల లో మూడు సార్లు 12 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని తెలిపారు.
త్వరలోనే ఇంకా పది బస్సులు ఏర్పాటు చేసి నియోజ కవర్గంలోనే ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు తిరగలా చర్యలు చేపడతానని తెలిపారు. గుంతలు పడిన రోడ్డును మరమ్మత్తు చేసి రోడ్డు వేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సు లలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తుందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమ ర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు జ్యోతిరావు పూలే.. ఎమ్మెల్యే బీవీ : భారతదేశంలో మొదటిసారిగా మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని, ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే బీవీ జయనా గేశ్వర రెడ్డి అన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.