కార్మికుల సమస్యలపై మాజీ MLA BC నిరాహార దీక్ష

www.politicalhunter.com_.jpg

నాపరాతి గని కార్మికుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాదయాత్ర నిరాహార దీక్ష.

మైనింగ్ లీజులను భారీ గా పెంచి వేలాది గని కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసారన్న మాజీ ఎమ్మెల్యే.

నాపరాతి గని కార్మికుల సమస్యపై న్యాయ పోరాటం చేస్తాం -మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.

బనగానపల్లె నియోజకవర్గం లోని కొలిమిగుండ్ల మండలం బందార్ల పల్లె రాయల్టీ చెక్పోస్ట్ దగ్గర బీసీ జనార్దన్ రెడ్డి గారు నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతుంది గనుక దీనిలో భాగంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు అంకిరెడ్డి పల్లె గ్రామం నుంచి బందార్లపల్లి చెక్పోస్ట్ వరకు నాయకులు కార్యకర్తలు, గని యాజమాన్యులు, గని కార్మికులతో, కలసి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వం కంటే రాయల్టీ ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆ రాయల్టీని పెంచడం వల్ల గని యజమానులు కార్మికులు నష్టపోతున్నారు కాబట్టి దానిని తగ్గించాలనే ఉద్దేశంతో అంకిరెడ్డి పల్లె నుంచి బందార్లపల్లి చెక్పోస్ట్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది.

అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ….

రాయల్టీ లీజుల పేరుతో ప్రభుత్వం అధిక రుసుము వసూలు చేస్తుండటం తో గని యజమానులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ,నాపరాతిపై ప్రభుత్వం విదిస్తున్న రాయల్టీ రేటు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

జిఓనెం 65 ప్రకారం ఒక హెక్టారుకు రూ.52 వేల ప్రకారం 10 రెట్లు చేసి ప్రీమియం మొత్తం రూ.520000లు ఒకేసారి కట్టాలి లేకుంటే లీజును రద్దు చేస్తూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఈవిదంగా కట్టిన రూ.520000 లు మొత్తం కూడా ప్రభుత్వ హుండిలో వేసినట్లే అని ,అదేవిదంగా కొత్తగా సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ఒక హెక్టారుకు రూ 52000*3 =రూ. 156000 లు కట్టాలి.అదేవిధంగా ఇంతటితో ఆగకుండా AMP, EC, CFO పెద్ద పరిశ్రమలకు వర్తింపచేసే అన్ని కుటీర పరిశ్రమలుండే నాపరాతి పరిశ్రమలపై వేసి, వాటిమీదనే ఆదారపడిన గని యజమానులు,ట్రాక్టర్ యజమాను లు,గని కార్మికుల కుటుంబాలను రోడ్డునపడేస్తున్నారని అన్నారు .మీరు ఇప్పుడు పెట్టిన షరతులు ఉపసంహరించు కోలేకపోతే మీకు సిగ్గూ శరము ఉంటే ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. అని బీసీ జనార్దన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.

కాటసాని రామిరెడ్డి నువ్వు ఒక అసమర్ధ ఎమ్మెల్యే వి ఇప్పుడు ఈ వేలము పెట్టి కొంతమంది పెట్టుబడి దారుల చేతిలోకివెళ్ళిపోయి చిన్న గని యజమానులు నష్టపోతున్నారు.అదేవిధంగా గతంలో గని, ట్రాక్టర్,లారి యజమానులు వారి సమస్యలపై ప్రభుత్వం పై ధైర్యంగా నిరసనలు తెలిపేవారని మరి ఇప్పుడు నాపరాతి పరిశ్రమకు గని యజమానులు ,రాయలసీమ అసోషియేన్ పెట్టేవాల్లని, మరి ఇప్పుడు వారు కేవలం వినతిపత్రాలు ఇవ్వడముతోనే సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పెట్టే వేదింపులకు తట్టుకోలేకనే అని అన్నారు. గతంలో అధికారంలోకి వస్తే బంధార్లపల్లె చెక్పోస్ట్ తీసివేస్తామని ఎంతో గొప్పగా చెప్పి అక్కడున్న కొట్టం తీసివేసి పర్మనెంట్ బిల్డింగ్ నిర్మించిన ఘనత మీది కాదా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఈ శాసనసభ్యుడు సిగ్గు శరం లేకుండా మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి కథలు చెబుతున్నారని,. అదేవిధంగా ఈ తుగ్లక్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన ఈ నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమను నమ్ముకున్న వేలాదిమంది గని ట్రాక్టర్ లారీ యజమానులు గని కార్మికులు మరియు వీటిపై ఆధారపడిన ప్రతి ఒక్క కుటుంబం కూడా రోడ్డున పడ్డారు.. ఆఖరికి గని యజమానులు గని కార్మికుల సమస్యల పరిష్కారానికి నేను నిరాహారదీక్ష ఒకరోజు చేయాలని పోలీస్ శాఖ వారిని అనుమతి అడుగుతే వారి మీద కూడా ఒత్తిడి తెచ్చి వారు సరైన సమయంలో అనుమతి ఇవ్వకపోతే చివరికి కోర్టుకెళ్తే కేవలం ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చినందున మధ్యాహ్నం ఒంటిగంటకు దీక్షను విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా పెట్టిన అనేక షరతులన్నీ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని రద్దు చేస్తాం అని, నష్టపోయిన గని యజమానులకు న్యాయం చేస్తాం అని,గతంలో కూడా చేశాం అని,ఇప్పుడు మళ్లీ చేసి చూపిస్తామని బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నారు.అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి గారు చేపట్టిన దీక్షను Nmd పారూక్ గారు, టీడీపీ నాయకులు గారి చేతుల మీదుగా నిమ్మరసం అందించి విరమించడం జరిగింది.

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిగారికి దీక్ష కు మద్దతు గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఫారూక్ గారు.,డోన్ టీడీపీ ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు దీక్ష లో పాల్గొనడం జరిగింది..

ఈ కార్యక్రమం లో భారీగా, కార్యకర్తలు, అభిమానులు, గని కార్మికులు, యాజమాన్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top