ప్రైవేట్ విద్యా సంస్థలు తీరుపై .. సిపిఐ ,యం యల్

Private educational institutions

Private educational institutions

  • మొద్దు నిద్ర వీడని విద్యాశాఖ – విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు
  • సిపిఐ (యం యల్ )లిబరేషన్ పార్టీ- జిల్లా నాయకుడు గాలి రవిరాజ్..

విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర

AP : నంద్యాల జిల్లా ఏర్పడి నప్పటి నుండి విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు . లక్షలకు లక్షలు విద్యార్థుల దగ్గరి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు . విద్య మాట దేవుడెరుగు కనీసం నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. నాణ్యత లోపించిన ఆహారం పెట్టి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఘాటుగా విమర్శించారు. నంద్యాల పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తిని తినక పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు చెల్లెస్తున్న పిల్లల తల్లి దండ్రులకు మాత్రం గర్భశోఖం మిగులుస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై పై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమైయ్యారని వారు అధికారులను విమర్శించారు.

ఈ మద్య కాలంలో పట్టణం లోని గుడ్ షేపర్డ్ స్కూల్ నందు నిర్భంద విద్య వలన స్కూల్ భవనం పైనుండి దూకడం, శాంతినికేతన్ స్కూల్ లో ఫుడ్ ఫాయిజన్ , SDR స్కూల్ నందు ఫుడ్ ఫాయిజన్ , జిల్లా లో ఎక్కడో ఒక చోట వరుస ఘటనలు జరుగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం చుట్టపు చూపుగా వెళ్ళి వారి స్వలాభాలు వెనుకేసుకోవడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు . నంద్యాలలో జిల్లా కలెక్టర్ , న్యాయశాఖ మంత్రి వున్న వీరు సైతం ప్రైవేట్ స్కూల్ పై చర్యలు శూన్యమేనని వారు విమర్శించారు. అసలు నంద్యాల జిల్లాలో ఎన్ని విద్యాలయాలకు అనుమతులు వున్నాయో అలాగే ఆట స్థలాలు సరైన సౌకర్యాలు హాస్టల్లో వసతులు సరిగా ఉన్నాయా లెవా అని ఏ రోజయినా ఏ అధికారైన సోదాలు నిర్వహించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!

సంఘటన జరిగితే పూర్తిగా విచారణ చేయాల్సిన అధికారులే మొక్కుబడిగా వెళ్ళి ముడుపులు ముడుతే చాలు అన్న చందంగా తూ తూ మంత్రంగా విచారణ జరిపామని చెబుతున్నారే..తప్ప జరిగిన సంఘటనకు బాధ్యులే లేరని చెప్పడం నిసిగ్గుగా ఉందన్నారు. ప్రైవేట్ స్కూల్ అని రేకుల షెడ్డులలో బాతురూం కూడా లేని స్కూల్ వున్నాయని అధికారులకు తెలియదా అని వారు ఆరోపించారు. మొక్కుబడిగా విచారణలు కాదు బాద్యులపై చర్యలు లెవా అని వారు సూటిగా ప్రశ్నించారు. ఇక కళాశాలలకు వస్తే ల్యాబ్లు కూడా లేకుండానే పాఠాలు బోదిస్తున్నారు, ఇకానైనా అధికారులు మొద్దునిద్ర వీడి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షoలో సిపిఐ (యం యల్ )లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్పడతామని వారు హెచ్చరించారు .

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top