మీజిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్నికల ముందు ఎదుర్కొన్న టాప్ 5 ప్రశ్నల్లో ఇది ఒకటి. మా మార్కాపురం డివిజన్ లో మూడు సీట్లు వైసీపీకి కంచుకోటలాంటివి. అందులో యర్రగొండపాలెం స్థానం వైసీపీకి పెట్టని కోట లాంటిది..
రాష్టంలో ఏపార్టీ గెలిచినా యర్రగొండపాలెంలో మాత్రం వైసీపీదే విజయం .. యర్రగొండపాలెం వైసీపీ టికెట్ వస్తే చాలు ఎమ్మెల్యే అయినట్లే ..2024 టీడీపీ కూటమి సునామిలో కూడా వైసీపీ తరుపున నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని చంద్రశేఖర్ గెలిచారు.
1978లో రద్దయి 2009లో మళ్ళీ ఏర్పడిన యర్రగొండపాలెం యస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు.
ఆదిమూలపు శామ్యూల్ జార్జి కొడుకుగా, జార్జి ఇంజనీరింగ్ కాలేజీ అధిపతిగా సురేష్ స్థానికంగా పరిచయం. శామ్యూల్ జార్జి ఎమ్మెల్యే ,ఎంపీ కావాలని కన్నా కల తీరలేదు. కానీ ఆయన కొడుకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఐదు ఏళ్ళు మంత్రిగా పనిచేశారు.
వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరిన సురేష్ కు 2014 ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం యర్రగొండపాలెం కాకుండా సంతనూతలపాడు టికెట్ కేటాయించారు.సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజుకు యర్రగొండపాలెం సీట్ ఇచ్చారు.రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలిచినా ఈ రెండు స్థానాల్లో వైసీపీ గెలిచింది.
యంగ్ అండ్ డైనమిక్
పాలపర్తి డేవిడ్ రాజు 90వ దశకంలో ప్రకాశం జిల్లాలో పవర్ ఫుల్ యువ నాయకుల్లో ముఖ్యుడు.ఆ సమయంలో కుటుంబ నేపధ్యం లేకుండా రాజకీయాల్లో ఎదిగిన అతి కొద్దీ మంది దళిత నాయకులలో డేవిడ్ రాజు ముఖ్యులు. మాజీ మంత్రి జీవీ శేషు గారు మరియు డేవిడ్ రాజు గారు ఇద్దరు ప్రకాశం జిల్లాలో స్వయం శక్తితో ఎదిగిన దళిత నేతలు. జూపూడి ప్రభాకర్ మరియు కాకుమాను రాజశేఖర్ ఎమ్మెల్యేలు కాలేకపోయిన దురదృష్టవంతులు.
వరుస అవకాశాలు
MA ,LLB చదివిన డేవిడ్ రాజు 1987 సంవత్సరం స్థానిక ఎన్నికలలో నాగులుప్పలపాడు ఎంపీపీగా గెలవటంతో రాజకీయ జీవితం మొదలైంది. తొలిరోజుల్లో దగ్గుబాటి అనుచరుడిగా ఉన్నా ఇతర నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉండేవి. 1995 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పరిషత్ యస్సీ(General )కు రిజర్వ్ కావటంతో డేవిడ్ రాజుకు అదృష్టం కలిసొచ్చింది. చంద్రబాబు వద్ద మంచి గుర్తింపు ఉన్న డేవిడ్ రాజు జడ్పీ చైర్మన్ అయ్యారు.
Alsho Read https://politicalhunter.com/cause-of-vijayawada-flood/
టీడీపీ – కమ్యూనిస్టుల పొత్తు తెగిపోవడంతో 1999 ఎన్నికల్లో సిపిఎం సిట్టింగ్ (1994లో సిపిఎం తరుపున తవనం చెంచయ్య గెలిచారు ) స్థానం సంతనూతలపాడు టీడీపీ టికెట్ డేవిడ్ రాజుకు దక్కింది.ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ విధంగా 12 ఏళ్లలోనే ఎంపీపీ , జడ్పీ చైర్మన్ & ఎమ్మెల్యే గా డేవిడ్ రాజు పనిచేశారు.ఇలా వరుసగా రాజకీయ పదవుల్లో పదోన్నతి దక్కటం చాలా అరుదు.
2009 ఎన్నికంలో మళ్ళీ టీడీపీ – కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోవటంతో సంతనూతలపాడు సీట్ సీపీఎంకు ఇచ్చారు . డేవిడ్ రాజుకు యర్రగొండపాలెం టీడీపీ సీట్ దక్కింది. కానీ ఆయన ఓడిపోయారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన డేవిడ్ రాజుకి జగన్మోహన్ రెడ్డి యర్రగొండపాలెం సీట్ కేటాయించారు. 2009 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి గెలిచిన ఆదిమూలపు సురేష్ కు సంతనూతలపాడు టికెట్ ఇచ్చారు,ఇద్దరూ గెలిచారు.
పార్టీ ఫిరాయింపు – ముగిసిన రాజకీయ జీవితం
2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన డేవిడ్ రాజు 2016లో టీడీపీలోకి ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపు ఏమి లాభపడ్డారో కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ కూడ దక్కలేదు.ఎన్నికల ముందు వైసీపీకి మద్దతు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున టికెట్ రేసులో కూడా నిలబడలేకపోయారు. చివరికి ఆయన కుమారుడు విజేష్ రాజును ను కాంగ్రెస్ తరుపున సంతనూతలపాడు నుంచి పోటీకి నిలపగా 2700 ఓట్లు వచ్చాయి.
మరణం
కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పాలపర్తి డేవిడ్ రాజు నిన్న హైదరాబాద్ ప్రైవేట్ హాస్పటల్ లో మరణించారు.తొలి పది సంవత్సరాల్లో ఎంత వేగంగా ఎదిగారో చివరి ఎనిమిది సంవత్సరాల్లో అంత వేగంగా రాజకీయంగా నష్టపోయారు.
పార్టీ ఫిరాయించకుండా ఉంటే యర్రగొండపాలెం,సంతనూతలపాడు ,కొండపి ఏదో ఒక స్థానం నుంచి కనీసం 2019 ఎన్నికల్లోనైనా టికెట్ వచ్చేది గెలిచేవారు కూడా …
ఈనాడు వార్త
డేవిడ్ రాజు మరణం మీద ఈనాడులో వచ్చిన వార్తలో రెండు పొరపాట్లున్నాయి.
1) ఎంపీటీసీగా పనిచేశారు:- 1987 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మూడు అంచల వ్యవస్థ ఉంది. అంటే ఎంపీటీసీ,జడ్పీటీసీ పోస్టులు లేవు.ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు జరిగాయి. డేవిడ్ రాజు ఎంపీటీసీగా పనిచేయలేదు నేరుగా ఎంపీపీ అయ్యారు.
2)1993 నుంచి 1998 జడ్పీ చైర్మన్ గా పనిచేశారు
1993లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదు,1995 మార్చ్ లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఐదు అంచల వ్యవస్థ వచ్చింది. అంటే సర్పంచ్ , ఎంపీటీసీ , ఎంపీపీ, జడ్పీటీసీ ,జడ్పీ చైర్మన్ పదవుల వచ్చాయి.1995 ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచి చైర్మన్ అయ్యారు.
1999 ఎన్నికల్లో డేవిడ్ రాజు ఎమ్మెల్యేగా గెలవటంతో ఖాళీ అయినా జడ్పీ చైర్మన్ పదవిని అర్ధవీడు జడ్పీటీసీ చేగిరెడ్డి రామకృష్ణారెడ్డి ఇంచార్జ్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు .
ప్రకాశం జిల్లాలో 1987 ఎన్నికల్లో ఎంపీపీలుగా గెలిచినవారిలో జంకె వెంకట్ రెడ్డి(1994 & 2014), డేవిడ్ రాజు(1999 & 2014) ఎమ్మెల్యేలు అయ్యారు.జంకె వెంకట రెడ్డి జడ్పీవైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు.
డేవిడ్ రాజు గారికి నివాళి.. శివ రాచర్ల Alsho Read https://www.facebook.com/share/p/WKNWYZEJjtuYrjxq/