కష్టపడిన వారికే నామినేటేడ్ పోస్టులు – సీఎం చంద్రబాబు

Good decision by CM Chandrababu

Good decision by ap CM Chandrababu Naidu

అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు , కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల జరి గిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్గా తీసుకుని పోరాడటం వల్లే

ఘన విజయం సాధ్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

కష్టపడిన వారికే పదువులు

Also Read నల్లమలకు అడవి దున్న

కష్టపడ్డ వారి వివరా లను సేకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్టులతో పాటు…ఇతర మార్గాల్లో కూడా రిపో ర్టులు చెప్పించుకుని కష్టపడిన వారికే

పదువులు వచ్చేలా చేస్తామని అన్నారు.పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుం దన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు

పార్లమెంట్ ర్లమెంట్ అధ్యక్షులతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ…

ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం, రా…కదలిరా. ప్రజాగళం వంటి వివిధ కార్యక్రమా లతో ప్రజలతోనే ఉన్నాం.

సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టాం. ,ycp ప్రబుత్వం గత ఐదేళ్లలో టిడిపి కార్యకర్తలపై , నాయకులపై

ఎన్నో అక్రమ కేసులు పెట్టింది ఇబ్బంది పెట్టింది . వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయడం వల్ల

57శాతం ఓట్లు సాధించి, 93శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచాంమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

పార్టీకి నష్టం చేసిన వారికి పార్టీలోకి ప్రవేశం లేదు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి, కార్యకర్త లకు నష్టం చేసి, వేధించిన వైసీపీ నేతలకు తెలుగు దేశం పార్టీలోకి ఎంట్రీ లేదు. పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేదన్నారు.

అధికారం వచ్చింద ని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవ హరించాలి. ప్రజలు నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారు.. వారి నమ్మకాన్ని నిలబెడదాం.

పొత్తు లో భాగంగా 31మంది పార్టీ ఇంఛార్జ్లకు సీట్లు రాలేదు… అయినా వెనకడుగు వేయకుండా కూటమి గెలుపే లక్ష్యంగా పని చేశారు.

అందువల్లే చరిత్రలో లేని విధంగా ఫలితాలు వచ్చాయి. నేను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నా..

రైట్ మ్యాన్స్…. రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తులో నిర్ణయాలు ఉంటాయి. 2029 ఎన్నికల్లో విజయానికి కూడా. ఇప్పటి నుండే ప్రణాళిక ఉండాలి.” అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో పండుగ వాతావరణం

ప్రజలకు మంచి చేస్తే మనకు అనుకూల ఫలితాలే వస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చుతున్నాం. మెగా డీఎస్సీకి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.

Buy it a good pen drive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top