జిల్లా వనరుల కేంద్రము, నంద్యాల వారి ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సహాయ వ్యవసాయ సంచాలకులు అధ్యక్షతన రైతు సేవ కేంద్రం సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.రామకృష్ణ రావు గారు ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నంద్యాల వారు మాట్లాడుతూ ఆత్మకూరు సబ్ డివిజన్లో సాగు చేసే ప్రధాన పంటలు అయిన వరి, మొక్కజొన్న, మినుము, జొన్న, మిరప పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు గురించి రైతు సేవ కేంద్రం సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగినది.
సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ గారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర@2047 రైతుల నుండి సలహాలు, సూచనలు అంతర్జాలంలో నమోదు చేయాలని సిబ్బందికి తెలిపారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పంట సాగులో మెలకువలు తెలుపుతూ దిగుబడులు పెంచాలని సూచించారు.
కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి గారు మహేష్ మరియు వెలుగోడు మండల వ్యవసాయ అధికారి గారు పవన్ పంటల జీవిత వ్యవస్థ (CLS) యాప్ గురించి అవగాహన కల్పించారు. అలాగే సమాచార హక్కు చట్టం- 2005 , ఈ పంట నమోదు సామాజిక తనిఖీ నిర్వహణ మొదలగు అంశాలపై రైతు సేవ కేంద్రాల సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది.
Also Read మూత్రాశయ రాళ్ళను కరిగించే కొండపిండి
జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి హేమాలత గారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంటల చీడపురుగులు , తెగుళ్లు వ్యాధి నిఘా వ్యవస్థ (NPSS) యాప్ పై అవగాహన కల్పించి క్షేత్ర సిబ్బందికి ఈ యాప్ గురించి రైతులకు తెలియ పరచాలని సిబ్బందిని సూచించారు.రానున్న రబీ పంటలలో పప్పు శనగ , మినుము మరియు ఇతర పంటల విత్తనాలను ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని ట్రైకోడెర్మా విరిడి @ 5-10 గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.రామకృష్ణ రావు గారు, ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఆంజనేయ గారు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి హేమలత గారు, ఆత్మకూరు , వెలుగోడు పాములపాడు, కొత్తపల్లి వ్యవసాయాధికారులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, పవన్ కుమార్ గారు, ఫణీశ్వర రెడ్డి గారు, మహేష్ గారు మరియు వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎంపీ ఈవోలు పాల్గొనడం జరిగింది.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV