- కొట్టాల చెరువు గ్రామంలో 2.30 కోట్ల నిధులతో వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి గనియా.. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ప్రధాన మంత్రి జన్ మన్ పథకంలో భాగంగా చెంచు గిరిజన విద్యార్థుల కోసం ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో 2.30 కోట్ల నిధులతో వసతి గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…చెంచులు తమ సంప్రదాయాలను వీడకుండా ఆధునిక ప్రపంచంతో చెంచులు పోటీపడాలని , తమ పిల్లలను చదువుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. చెంచుల కోసం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నాయని వాటిని వినియోగించు కొని ముందుకు వెళ్లాలని అన్నారు . ఉద్యోగ కల్పనలో కూడా చెంచులకు మంచి ప్రాధాన్యత ఉందని , అడవులను వదిలి మీ పిల్లలను బడిబాట పట్టించాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రతి చెంచు కుటుంబానికి పక్కా గృహాన్ని నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. 50 ఏళ్లకే చెంచులకు పించన్ అందించిన ఘనత సిఎం చంద్రబాబు నాయుడు దని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. గత వైసిపి ప్రభుత్వం తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలతో గద్దెకెక్కి ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే వర్షాలు రావని తప్పుడు మాటలను ప్రజల్లోకి తీసుకుపోయారని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలోనే మంచి వర్షాలు పడుతూ.. నియోజకవర్గంలోని చెరువులు అన్నీ నిండుకుండను తలపిస్తున్నాయని..వైసిపి నాయకులు చేసే తప్పుడు మాటలను పట్టించుకోవద్దని ..చెంచుల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు.
Also Read పెద్దల అమావాస్య ఎందుకు చేస్తారు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ.. జిల్లాలో 14 మండలాలు , 34 గ్రామాలు, 48 చెంచుగూడెంలు ఉన్నాయని అందులో 2,951 కుటుంబాలు ఉండగా పదివేల జనాభా మాత్రమే చెంచు జనాభా ఉందని .. కానీ జిల్లాలో 20 లక్షల జనాభా ఉండగా కేవలం 10,000 జనాభా ఉన్న చెంచులకు మన కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం మీరు గమనించాలని అన్నారు. చెంచులను అభివృద్ధి చేయాలన్న తపన..ఎంత చిత్తశుద్ధి ఉందో మీరే గుర్తించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెంచుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని చెంచులు అభివృద్ధి పథంలో నడవాలని కలెక్టర్ వారిని కోరారు.
కలెక్టర్ ను నిలదీసిన చెంచు మహిళ
గ్రామానికి చెందిన ఒక చెంచు మహిళా మాట్లాడుతూ చెంచుల పేరు చెప్పుకొని మాకు అందాల్సిన పథకాలను, ఉద్యోగాలను వేరే ఇతర కులాల వారు తన్నుకపోతున్నారని, దీనికి ప్రభుత్వం వారిని కట్టడి చేయాలని అసలైన చెంచులు ఎవరు అనేది గుర్తించాలని కోరారు . అలాగే పిచ్చెరువు గూడెం నుంచి పునరావాస కేంద్రమైన కొట్టాలచెరువుకు తరలించినప్పటికీ.. మాకు అటవీ ఫల సేకరణ తోనే మా జీవన ఉపాధి ఉంటుందని.. కానీ ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెట్టడం వల్ల మేము అడవిలోకి వెళ్లలేక..మా.. జీవనం గడవక అవస్థలు పడుతున్నామని .. మాకు అటవీ ఫల సేకరణకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ని చెంచు మహిళ కోరింది..
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV