- : అక్టోబర్ 1వతేది నుంచి పునప్రారంభం
- : పెద్దపులుల కలయికతో మూతపడ్డ టూరిజం
- : కొంత హంగులతో పర్యటకులకు శోభా
- : ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ లో నల్లమల అందాలు
- : పర్యటకులకు సౌకర్యలు కల్పిస్తాం
- : నాగులూటి రేంజర్ దొరస్వామి
Article by ———- సగినాల రవి కుమార్ – 8309888954
నల్లమల అందాలలో అటవీశాఖ ఆద్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పర్యటకులకు అందుబాటులోకి ఏకోటూరిజంను తీసుకోని వచ్చారు. నల్లమల వన్యప్రాణి అటవీ ప్రాంతంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ పెద్ద పులుల అభయారణ్యంలో గత మూడు నెలల నుంచి పెద్దపులుల కలయికతో జన సంచారం లేకుండా అటవీశాఖ అధికారులు కఠినమైన నిబందనలను అమలు చేశారు. ఇందులో భాగంగానే ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి ఏకో టూరిజంను నిలిపివేశారు. అక్టోబర్ 1వతేది నుంచి పర్యటకులకు కనువిందు చేసే విదంగా కొత్త హంగులతో ఏకో టూరిజంను మళ్లీ పునప్రారంభం కానుంది.

Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
నల్లమలై జంగిల్ క్యాంపుతో అంతర్జా లంలో అటవీశాఖ అధికారులు స్పేషల్ కాటేజిలు, సాపారి వంటి సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో ముందస్తుగానే బుకింగ్ చేసుకుంటే పర్యటకులకు అన్ని విదాలుగా మౌళిక సదుపాయాలు కల్పించే విదంగా అటవీశాఖ చోరవ తీసుకున్నట్లు సమాచారం. ఏకోటూ రిజం పరిధిలో కాటేజిలలో ఒకరోజు అక్కడే ఉండే పర్యటకులకు జంగిల్ సఫారి ద్వార ఆటవీ మార్గంలోఉదయం 6.30గంటల నుంచి 8.30 గంటల వరకు దాదాపు 18 కిలో మీటర్లు అటవీలోనే పర్యటకులను సఫారిలో నల్లమల అందాలను వన్యప్రా నులను చూపించడం జరుగుతుంది. సాయంత్రం 4గంటల నుంచి 6గంట ల వరకు మరో సారి నల్లమల అందా లను చూపిస్తారు. ఏకో టూరిజం ద్వారా ప్రతి నెల అటవీ శాఖకు ఆదాయం రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు వస్తున్నట్లు అటవీశాఖ అధికా రుల గణంకాలు తెలుపుతు న్నాయి. ఇందులో పనిచేసే సిబ్బందికి దాదా పుగా 30మందికి పైగా జీతాలుచెల్లించనున్నారు. రాత్రివేళ బస చేసే పర్యటకులకు భోజనం సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు అటవీశాఖ అధికారులు చూసు కుంటారు. వర్యటకులకు నల్లమల అందాలను తిలకించేందుకు అట వీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన వెబ్ సైట్ https://nstr.co.in/nallamala-jungle-camps-bairluty/ పర్యాటకులకు అంతర్జాలంలో వివరాలు ఉంటాయి. అసక్తి గల పర్యటకులు ముందస్తు గానే ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆటవీశాఖ అధికారులు తెలియజేశారు.

నాగులూటి రేంజర్ దొరస్వామి
ఈ విషయంపై నాగులూటి రేంజర్ దొరస్వామి మాట్లాడుతూ.. వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలో పర్యటకులకు కనువిందు చేసే విదంగా నల్లమల అందాలను తిలకించేందుకు వచ్చే నెల 1వతేది నుంచి మళ్లీ ఏకోటూరిజం ప్రారంభించేందుకు వన్యప్రాణి విభాగం డిప్యూటి డైరెక్టర్ ఆదేశాలతో పునప్రారంభం జరుగుతుందని తెలియజేశారు. పర్యటకుల అందరికి మౌళిక సదుపాయాలు కల్పించే విదంగా అటవీశాఖ అదికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక కాటేజిలతో 24గంటలు ఉండే పర్యటకులకు జంగిల్ సఫారి ద్వారా నల్లమలలో ఉండే వన్యప్రానులను చూసే విదంగా అటవీశాఖ అధికారులు చోరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పర్యటకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.