కర్నూలులో ట్రాఫిక్ మళ్ళింపు…జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్

Traffic diversion in Kurnool

Traffic diversion in Kurnool

కర్నూలు పట్టణ ప్రజలకు గమనిక… నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు. … జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

డిసెంబర్ 5 న కర్నూలు STBC కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన కార్యక్రమం .

డిసెంబర్ 5 ( సోమవారం) న కర్నూలు రాయలసీమ గర్జన కార్యక్రమం సంధర్బంగా సోమవారం ఉదయం నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్ళించామని శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

రాయలసీమ గర్జన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుండి భారీ జన సమీకరణ రానునుండడంతో వాహానాలకు పార్కింగ్ ప్రదేశాలను కేటాయించామన్నారు.

కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో వాహనాల పార్కింగ్…

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

శ్రీశైలం, నందికోట్కూరు, ఆత్మకూరు నియోజక వర్గాల నుండి వచ్చే వాహనాలు కర్నూలు సి.క్యాంపు మీదుగా వచ్చి కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో వాహనాల ను పార్కింగ్ చేసుకోవాలన్నారు.

డోన్, నంద్యాల, బనగానపల్లి, ఆదోని, పాణ్యం, ఆళ్లగడ్డ, కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు మరియు ఏమ్మిగనూరు నియోజక వర్గాల నుండి వచ్చే వాహనాలను బళ్ళారి చౌరస్తా మీదుగా సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ జాతీయ రహదారి మీదుగా మామిదలపాడు తుంగభద్ర బ్రిడ్జి జంక్షన్ క్రాస్ నుండి కుడి వైపుకి తిరిగి కర్నూలు నగరంలోనికి చేరుకోవాలన్నారు.

కర్నూలు, సుంకేశుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాలలో పార్కింగ్…

రాయలసీమ గర్జన కార్యక్రమానికి వచ్చే వారి భారీ వాహనాలు అన్నీ కూడా సుంకేశుల రోడ్డు లో ఉన్న సెయింట్ జోసఫ్ కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలన్నారు.

3) కోల్స్ కళాశాల మైదానం, కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్…

కళాశాలల నుండి University నుండి వచ్చు స్టూడెంట్స్ వాహనాల కోసము ప్రత్యేక పార్కింగ్ ను కేటాయించడం అయినది

ఎస్టీబిసి కళాశాల ఎదురుగా ఉన్న రూట్ లో ఒక రూట్ లో మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు సెకండ్ రోడ్ ఎమర్జెన్సీ కోసము ప్రత్యేకించి ఖాళీగా వుంచబడును.

ఎస్టీ బిసి కళాశాల నుండి రాజ్ విహార్ మీదుగా , గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మరియు ఆనంద్ సినిమా హాల్ ముందు వున్న హంద్రీ బ్రిడ్జి ని కూడా కేవలము అత్యవసర నిమిత్తం వేళ్ళే వాహనాలు మరియు ఇతర అంబులెన్సు వాహానాల కోసము ప్రత్యేకముగా వుంచడమైనది.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

పార్కింగ్ స్థలాలు ఇవే కాకుండా వాహనాల యొక్క పరిస్థితి ని బట్టి మరొకొన్ని ప్రదేశాలు అయిన , ZP office, Municipal High school, CSI Church యందు కూడా పార్కింగ్ కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

మరి యొక ముఖ్య గమనిక ఏమనగా …

ఈ క్రింది రూట్ ల యందు వాహనాల రవాణాను ఉదయము 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిషేదించడమైనది .

Old PCR జంక్షన్ నుండి SBI circle వరకు

శ్రీరామ సినిమా హల్ జంక్షన్ నుండి 5 roads జంక్షన్ వరకు

ప్రకాష్ నగర్ బ్రిడ్జి (St Joseph college) నుండి SBI circle వరకు

ZP office జంక్షన్ నుండి 5 roads junction వరకు

మోర్య ఇన్ జంక్షన్ నుండి 5 roads జంక్షన్ వరకు

రైల్వే స్టేషను ముందు నుండి 5 roads జంక్షన్ వరకు

పైన తెలిపిన రూట్ ల యందు

సభకు హాజరవు వారిని తప్ప మిగతావారిని అనుమతించబడరు దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలను వాడుకోవల్సిందిగా ప్రజలను కోరడమైనది.

జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top